Nissan Tecton Colour Options: భారత మార్కెట్లో కొత్త SUVని తీసుకొచ్చింది నిస్సాన్. టెక్టన్ పేరుతో విడుదలైన ఈ SUV ఇప్పటికే కారు లవర్స్ ను ఆకట్టుకుంటుంది. స్టైలిష్ డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో పాటు పలు కలర్ ఆప్షన్స్ కూడా ఈ కారును ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. అయితే, అన్ని కలర్స్ అన్ని వేరియంట్లలో అందుబాటులో లేవు. ఇంతకీ ఏ రంగు ఏ వేరియంట్‌లో లభిస్తుందో తెలుసుకుంటే, నచ్చిన కారును సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది.
నిస్సాన్ టెక్టన్ మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి విసియా, విసియా ప్లస్, అసెంటా, ఎన్ కనెక్టా, టెక్నా, టెక్నా ప్లస్. అంతేకాదు, ఈ SUVని కంపెనీ మొత్తం ఆరు ఎక్స్ టీరియర్ కలర్స్ లో తీసుకొచ్చింది. అవి ఓనిక్స్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్, పెర్ల్ వైట్, ఫ్లేర్ గార్నెట్ రెడ్, ఇండిగో బ్లూ, మూన్‌బో గ్రే. ఇవాటిలో ఓనిక్స్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్, పెర్ల్ వైట్ కలర్స్ అన్ని వేరియంట్లలో లభిస్తాయి. కానీ, ఫ్లేర్ గార్నెట్ రెడ్ మాత్రం అసెంటా వేరియంట్ నుంచి ప్రారంభమవుతుంది. ఇండిగో బ్లూ రంగు ఎన్ కనెక్టా, టెక్నా, టెక్నా ప్లస్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక మూన్‌బో గ్రే రంగు టాప్ వేరియంట్లైన టెక్నా, టెక్నా ప్లస్‌లో మాత్రమే లభిస్తుంది. సో.. నచ్చిన రంగు కోసం కొన్నిసార్లు హై వేరియంట్ ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
టెక్టన్‌లో ఆధునిక SUVకి అవసరమైన దాదాపు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్లు, ఆటో AC, వెనుక AC వెంట్స్, USB Type-C పోర్టులు వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, టాప్ వేరియంట్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్ రూఫ్, పవర్డ్ టెయిల్ గేట్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లాంటి ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫోటైన్ మెంట్ కోసం 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ తో పాటు వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ ఇచ్చారు. డ్రైవర్ కోసం 10.25 అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది.
భద్రత పరంగా కూడా కంపెనీ రాజీ పడలేదు. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్ బ్యాగ్‌లు, ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. హైఎండ్ వేరియంట్లలో 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ADAS, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి అధునాతన భద్రతా వ్యవస్థలు ఉన్నాయి.
టెక్టన్‌లో రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 100 PS పవర్ ను ఉత్పత్తి చేస్తే, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 163 PS పవర్‌ను అందిస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి.ధర విషయానికి వస్తే.. నిస్సాన్ టెక్టన్ ప్రారంభ ధర రూ.10.49 లక్షలు (ఎక్స్ షోరూమ్) కాగా, టాప్ వేరియంట్ ధర రూ.18.59 లక్షలు వరకు ఉంటుంది. ఈ SUV మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్ వ్యాగన్ టైగన్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Read Also: గ్రాండ్ విటారాపై బంపర్ ఆఫర్.. వామ్మో.. అన్ని వేల డిస్కౌంటా!?