E-Paper
Advertisement

‘జన నాయగన్ ‘ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్లు మార్చుకున్న స్టార్ హీరోలు..!

‘జన నాయగన్ ‘ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్లు మార్చుకున్న స్టార్ హీరోలు..!
Advertisement

JanaNayagan : తమిళనాడు సీఎం, హీరో విజయ్ దళపతి చివరగా నటించిన చిత్రం ‘జననాయగన్ ‘.. ఈ మూవీ ఈ ఏడాది జనవరిలోనే థియేటర్లోకి రావాల్సి ఉంది. సెన్సార్ సర్టిఫికెట్ కారణాలవల్ల ఆగిపోవడంతో సినిమా వాయిదా పడింది. సెన్సార్ రివ్యూ రాకపోవడం వల్లే ఈ సినిమా వాయిదా పడింది అని అందరికీ తెలిసిందే.. గత కొన్ని నెలలుగా ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇన్నాళ్లకు జూలై 24న సినిమాని అధికారికంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రకటించినట్లు తెలుస్తుంది. అయితే మొదటినుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ థియేటర్లలోకి వస్తుందని మిగిలిన సినిమాలు అన్నీ కూడా వాయిదా పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ సినిమాలు వాయిదా పడ్డాయో ఒకసారి మనం చూసేద్దాం..

కోలీవుడ్ లో జననాయగన్ ఎఫెక్ట్..

తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి రాజకీయాల్లోకి రాకముందు చివరిగా నటించిన చిత్రం జన నాయగన్.. ఈ మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని బిజీ అభిమానులు కళ్లకు కాయలు కట్టినట్టుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రకటించినప్పటి నుంచి తమిళ ఇండస్ట్రీలో రోజుకో వార్త వినిపిస్తుంది.. తమిళ చిత్ర పరిశ్రమలో మూవీస్‌ రిలీజ్ క్యాలెండర్ ఒక్కసారిగా మారిపోయింది… ఈ చిత్ర ఎఫెక్ట్ మిగిలిన సినిమాలపై బాగానే పడింది. ఒక్కో సినిమా తమ రిలీజ్ డేట్ ని మార్చుకుంటున్నట్లు సమాచారం. స్టార్ హీరోలు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి అంటే మిగిలిన హీరోలు చాలావరకి తమ రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకుంటున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సినిమాలు పెద్దగా రిలీజ్ కావడం లేదు..

ఏ సినిమాలు వాయిదా పడ్డాయంటే..?

Advertisement

తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘ఇమ్మోర్టల్’ ఈనెల 23న థియేటర్లలోకి రావాల్సి ఉంది. ఇప్పుడు విజయ్ సినిమా వల్ల పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది. స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్ కనగరాజ్‌ నటించిన ‘డీసీ’, అలాగే సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సిగ్మా వంటి సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఈనెల 31న ఈ సినిమాలు మళ్లీ థియేటర్లలోకి రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మాత్రం ‘అన్బే డయానా’ అనే చిత్రం ఈనెల 17న రాబోతుంది.. నెక్స్ట్ ఇంకా ఏ సినిమాలు రావడంలేదని కోలీవుడ్ వర్గాల్లో టాక్.. మరి విజయ్ సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి. లేటుగా వస్తున్న లేటెస్ట్ గా ఉండాలి అన్నట్టుగా ఈ సినిమా దెబ్బకు మిగిలిన సినిమాలు అన్నీ కూడా వాయిదా పడ్డాయి. గత కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా విజయ్ అభిమానులను ఈ సినిమా ఎలా అలరిస్తుందో చూడాలి.. ఈ సినిమా చివరి సినిమా కావడంతో భారీగా కలెక్షన్లు కూడా వసూల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి..

Also Read :తలైవా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్… అదే ఆఖరి సినిమానా..?

Related News

సోగ్గాడు రియల్ లైఫ్ సీక్రెట్స్:భార్య శాంతకుమారి మరణంతో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విశేషాలు!

తలైవా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్… అదే ఆఖరి సినిమానా..?

Lenin Twitter Review : ‘లెనిన్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అయ్యగారు అకౌంట్లో హిట్ పడిందా..?

ఆ పలకరింపే ఊపిరిపోసింది.. రాశీఖన్నా ఎమోషనల్ పోస్ట్!

కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్…26 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లెజెండ్ ఎంట్రీ !

77 వేల క్యాప్ నుండి రూ.7 కోట్ల క్యారవాన్ వరకు…హీరోల రాయల్ లైఫ్ స్టైల్ చూశారా?

డీప్ ఫేక్ కి బాంబే హైకోర్టు బ్రేక్.. సొట్టబుగ్గల సుందరికి బిగ్ రిలీఫ్!

Big Stories

Advertisement
×