Pawan Kalyan – Nidhhi Agerwal : పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. దాదాపు 5 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్న ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు విపరీతమైన అంచనాలు పెరిగాయి. పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో తెలుగు రాష్ట్రాల్లో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే హైదరాబాదులో ట్రాఫిక్ ఏ రేంజ్ లో ఉండబోతుందో, ఏకంగా డిపార్ట్మెంట్ కూడా జాగ్రత్తలు చెప్పిన రోజులు ఉన్నాయి.
ఇప్పుడు బుక్ మై షో వచ్చి టికెట్లు ఈజీగా దొరుకుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకు టికెట్లు దొరకడమే అచీవ్మెంట్. మొత్తానికి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రస్తుతం మిశ్రమ స్పందన లభిస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులను ఈ సినిమా ఎంతవరకు సంతృప్తి పరిచింది అనేది పక్కన పెడితే, చాలామంది ట్రోల్ చేసే వాళ్లకు మాత్రం ఈ సినిమా మంచి స్టఫ్ అయిపోయింది.
పాపా బాబు కెమిస్ట్రీ పై ట్రోల్స్
మామూలుగా తెలుగు ప్రేక్షకులు ఒకరిని ఇష్టపడితే అది ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. కొన్ని స్లొగన్స్ కూడా వాళ్ళ మీద క్రియేట్ చేస్తారు. రీసెంట్ టైమ్స్ లో బాగా పాపులర్ అయిన స్లోగన్ “పాపలకే పాప నిధి పాప” హరిహర వీరమల్లు సినిమాని నిధి అగర్వాల్ విపరీతంగా ప్రమోట్ చేశారు. ఆమె ప్రమోట్ చేసిన విధానం చూసి పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగి ప్రమోట్ చేశారు. అయితే ఈ సినిమాలు వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ కాలేదు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ వినిపిస్తుంది. ఈ సినిమా విఎఫ్ఎక్స్ గురించి ట్రోలింగ్ వినిపిస్తున్న మాట కూడా వాస్తవమే. ఇకపోతే బయట నిధి అగర్వాల్ గురించి పవన్ కళ్యాణ్ మాత్రం భారీ ఎలివేషన్ ఇచ్చి మాట్లాడారు. ఇప్పుడు హీరోయిన్ గురించి పవన్ కళ్యాణ్ అలా మాట్లాడిన దాఖలాలు లేవు. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ కూడా తనని ఓన్ చేసుకున్నారు.
సినిమా సక్సెస్ మీట్
రీసెంట్ లో ఒక సినిమా రిలీజ్ అయిన మరుక్షణమే సక్సెస్ మీట్ పెట్టడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. సినిమా గురించి ఒక వైపు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నా కూడా, సాయంత్రానికి సక్సెస్ మీట్ పెట్టే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్. ఈ సక్సెస్ మీట్ కు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రస్తుతానికి మిశ్రమ స్పందనను అందుకుంటుంది. ఒక రెండు మూడు రోజులు పోతే అసలైన టాక్ ఏంటో బయటకు వస్తుంది. ఫస్ట్ అఫ్ వరకు అద్భుతంగా సాగిన ఈ సినిమా, సెకండ్ ఆఫ్ లో మాత్రం బోలెడు కంప్లైంట్స్ నమోదు చేసుకుంది.
Also Read: HHVM VFX : వీరమల్లు కార్టూన్ వీరుడు… ఎంత మోసం చేశావ్ జ్యోతికృష్ణ