E-Paper
Advertisement

ఫ్రీలాండర్ రీ-ఎంట్రీ.. ఒకేసారి EV, PHEV, EREV వెర్షన్లలో క్రేజీ SUV లాంచ్!

ఫ్రీలాండర్ రీ-ఎంట్రీ.. ఒకేసారి EV, PHEV, EREV వెర్షన్లలో క్రేజీ SUV లాంచ్!
Advertisement

New Freelander SUV Revealed: ఫ్రీలాండర్ మళ్లీ మార్కెట్ లోకి విడుదలకాబోతోంది. కానీ, ఈసారి పూర్తిగా కొత్త కొత్త వెర్షన్లలో వినియోగదారుల ముందుకు రాబోతోంది. గతంలో ల్యాండ్ రోవర్ మోడల్‌ గా ఉన్న ఫ్రీలాండర్, ఇప్పుడు చెరీ–JLR భాగస్వామ్యంతో స్పెషల్ ప్రీమియం SUV బ్రాండ్‌ గా మార్కెట్ కు పరిచయమవుతోంది. ఈ కొత్త రూపంలో, ఎలక్ట్రిక్ టెక్నాలజీపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.

కాన్సెప్ట్ 97 ఆధారంగా..

ఈ కొత్త బ్రాండ్ నుంచి వచ్చే ఫస్ట్ SUV, కాన్సెప్ట్ 97 ఆధారంగా రెడీ అవుతోంది. 1997లో మొదటిసారి ఫ్రీలాండర్ మార్కెట్లోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేసేలా ఈ పేరు పెట్టారు. స్ట్రాంగ్, ఆఫ్ రోడ్‌ కు అనువైన ఎలక్ట్రిఫైడ్ SUVగా తయారవుతోంది. ప్రొడక్షన్ మోడల్‌ లో చిన్న మార్పులు తప్ప, కాన్సెప్ట్ డిజైన్‌ ను దాదాపు అలాగే కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త SUV 800V లేటెస్ట్ ఎలక్ట్రికల్ ప్లాట్‌ ఫారమ్‌ మీద నిర్మించబడుతోంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఒకే ప్లాట్‌ ఫారమ్‌ పై పూర్తిగా ఎలక్ట్రిక్ (EV), ప్లగ్ ఇన్ హైబ్రిడ్ (PHEV), అలాగే రేంజ్ ఎక్స్‌ టెండర్ (EREV) లాంటి విభిన్న పవర్‌ ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఫ్రీలాండర్ డిజైన్ గురించి..

Advertisement

ఇక ఈ కారు డిజైన్ విషయానికి వస్తే,  ఈ SUV బలమైన, బాక్సీ స్టైల్‌ లో కనిపిస్తుంది. పాత ఫ్రీలాండర్ మోడళ్లతో పాటు డిఫెండర్ వంటి ల్యాండ్ రోవర్ వెహికల్స్ నుంచి ప్రేరణ పొందింది. LED లైట్లు, ప్రత్యేకమైన సైడ్ డిజైన్, బలమైన స్కిడ్ ప్లేట్లు లాంటి అంశాలు దీనికి మరింత ప్రత్యేకమైన లుక్ ను అందిస్తాయి.

ఇంటీరియర్ గురించి..

ఈ కారు ఇంటీరియర్ ప్రీమియం స్థాయిలో ఉంటుంది. ఈ SUVలో 3 రో సీటింగ్ (2+2+2) ఉండే అవకాశం ఉంది. మొత్తం ఆరుగురు సౌకర్యంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. లోపల పెద్ద టచ్‌ స్క్రీన్, డిజిటల్ డిస్‌ ప్లేలు, కనెక్టెడ్ టెక్నాలజీ లాంటి ఆధునిక ఫీచర్లు ఉంటాయి. అటు స్నాప్‌ డ్రాగన్ చిప్‌ సెట్ ఆధారంగా పనిచేసే సిస్టమ్, LiDAR సపోర్ట్‌ తో కూడిన అడ్వాన్స్‌ డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. వెనుక సీట్లలో ఎంటర్‌ టైన్‌ మెంట్ స్క్రీన్‌లు, మంచి క్వాలిటీ సీట్లు కుటుంబ వినియోగదారులను ఆకర్షించేలా ఉంటాయి.

Advertisement

Read Also: ఆలస్యం చేస్తే మిస్.. EV కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్

ఈ కారు ఎక్కడ తయారవుతుందంటే?

ఈ కారు చైనాలోని చాంగ్‌ షూలో ఉన్న ప్లాంట్‌ లో తయారవుతుంది. అక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ భావిస్తోంది.  అయితే, ప్రతి దేశానికి వేర్వేరు అవసరాలు ఉండటంతో, ఆయా మార్కెట్లకు తగ్గట్టు మోడళ్లను మారుస్తారు.

Read Also: కారు పెయింట్ కొత్తదానిలా మెరవాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Related News

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×