Sonu Sood on Fish Venkat: ప్రముఖ సినీ నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు సోనుసూద్ (Sonusood). అటు సినీ నటుడిగా, ఇటు మంచి మనసున్న వ్యక్తిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతోమందికి ఆర్థికంగా అండగా నిలబడిన సోనుసూద్..సూద్ చారిటీ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి విద్యా, వైద్యం, ఆరోగ్య సేవలు అందిస్తూ అండగా నిలుస్తున్నారు. అంతేకాదు పేద మహిళలకు అండగా నిలవడమే కాకుండా.. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ అలాంటి సమస్యతో బాధపడుతున్న పేద మహిళలకు ఉచితంగా ఆపరేషన్ కూడా చేయిస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు తన గొప్ప మనసు చాటుకుంటున్న సోనూసూద్.. ఇప్పుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా.. ఆర్థిక సహాయం అందించారు సోనూసూద్.
ఫిష్ వెంకట్ మరణం.. స్పందించని ఇండస్ట్రీ..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఫిష్ వెంకట్ 100కు పైగా చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవలే కిడ్నీలు రెండు పాడవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి, తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇకపోతే తోటి నటుడు మరణించారు అన్న విషయం తెలిసి కూడా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడం బాధాకరం అని చెప్పాలి.
ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనుసూద్ ఆర్థిక సాయం..
ఇలాంటి సమయంలో ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా నేనున్నాను అంటూ సోను సూద్ ముందుకు వచ్చారు. వాస్తవానికి ఫిష్ వెంకట్ అనారోగ్య పరిస్థితి తెలిసినప్పుడే లక్ష రూపాయలు బ్యాంకు ద్వారా ఖర్చులకు పంపించాలనుకున్నరట. కాకపోతే బ్యాంకు ఇష్యూ వల్ల అది కుదరలేదట. దీనికి తోడు సోనుసూద్ పీఏ కూడా ఫిష్ వెంకట్ కుటుంబంతో మాట్లాడుతూ.. కిడ్నీ రెడీ చేసుకుంటే అందుకు కావలసిన పూర్తి ఖర్చు తామే భరిస్తామని కూడా హామీ ఇచ్చారట. కానీ కిడ్నీ దొరకలేదు” అని తెలిపారు. ఇక సోను విదేశాలలో ఉండడం వల్ల నేరుగా వచ్చి కలిసి సహాయం చేయలేకపోయామని బాధపడ్డారు. అంతేకాదు ఆ లక్ష రూపాయలు ఇప్పుడు ఖర్చులకు పెట్టుకోమని.. విదేశాల నుండి తిరిగి వచ్చిన వెంటనే కుటుంబాన్ని కలిసి మీకు పూర్తి అండగా నిలుస్తానని.. ఆ కుటుంబ సభ్యులతో బిగ్ టీవీ ఫోన్ కాల్ ద్వారా సోను సూద్ మాట్లాడారు.
ఫిష్ వెంకట్ నాకు తమ్ముడు లాంటివారు – సోను సూద్
ఇక ఫిష్ వెంకట్ తనకు తమ్ముడు లాంటివాడు అని, ఖచ్చితంగా సహాయం చేస్తానని, ఎప్పుడు ఏం అవసరం వచ్చినా వెంటనే అడగాలని కూడా తెలిపారు. మొత్తానికైతే సోను సూద్ ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా నిలుస్తూ ఆర్థిక భరోసా ఇవ్వడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ALSO READ:Kantara Chapter 1 : మొత్తానికి కాంతారా చావులు ఆగాయి… ఆఫీషియల్‌గా అనౌన్స్ చేసిన హీరో