Kantara Chapter 1 : పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతోంది కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి (Rishab Shetty) రచన, దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని హోం భలే ఫిలిమ్స్ ఆధ్వర్యంలో విజయ్ కిరంగదూర్ నిర్మించారు. 2022లో కాంతారా మూవీగా వచ్చిన ఈ సినిమాకి ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ వన్ రాబోతోంది. దైవిక సాంప్రదాయం పూర్వికుల సంఘర్షణ మధ్య మూలాలను చాలా లోతుగా చూపించారు. అటు చిన్న సినిమాగా వచ్చి ‘కాంతారా’పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి ముందు ఏం జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తూ.. కాంతారా చాప్టర్ వన్ గా రిలీజ్ చేయబోతున్నారు రిషబ్ శెట్టి.
ఆకట్టుకుంటున్న కాంతారా చాప్టర్ 1 మేకింగ్ వీడియో..
ఇదిలా ఉండగా అక్టోబర్ 2వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుంచి తాజాగా అప్డేట్ ని 10:35 కి వదులుతామంటూ మేకర్స్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిత్ర బృందం చెప్పినట్టుగానే తాజాగా ఈ చిత్రం నుండి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో చూపర్లను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా షూటింగ్ పూర్తి అవడంతో అందుకు సంబంధించిన ఈ మేకింగ్ వీడియోని తాజాగా విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు. రిషబ్ శెట్టి వాయిస్ తో నడిచిన ఈ వీడియో ఇప్పుడు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
మేకింగ్ వీడియో విషయానికి వస్తే..
కాంతారా చాప్టర్ వన్ నుండి విడుదల చేసిన మేకింగ్ వీడియో విషయానికొస్తే.. 2:06 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో రిషబ్ శెట్టి వాయిస్ తో ప్రారంభం అవుతుంది. ఈ సినిమా కోసం జిమ్లో రిషబ్ శెట్టి కష్టపడుతున్న షార్ట్ తో వీడియోని స్టార్ట్ చేశారు. “నాదొక కల. మన మట్టి కథను మొత్తం ప్రపంచానికి చెప్పాలని.. మన ఊరు.. మన జనం.. మన నమ్మకాలు.. నేను ఈ కథను చెప్పడానికి ముందుకు వెళ్ళినప్పుడు వేలమంది నా వెంట నడిచారు. మూడేళ్ల కఠోర శ్రమ.. 250 రోజుల చిత్రీకరణ. ఎంత కష్టమొచ్చినా నేను నమ్ముకున్న దైవం నా చేయి వదలలేదు. మా మొత్తం బృందం, మా నిర్మాత నా వెంటే ఉన్నారు. ప్రతిరోజు సెట్ లో వేలమందిని చూస్తున్నప్పుడు నన్ను వెంటాడుతున్న ఒక విషయం ఒకటే. యాక్షన్.. ఇది కేవలం సినిమా కాదు ఒక శక్తి”. అంటూ ఈ సినిమా కోసం చిత్ర బృందం పడ్డ కష్టాన్ని మొత్తం చూపించారు. ఇక మేకింగ్ వీడియోనే ఇన్ని అంచనాలు పెంచేసిందంటే.. ఇక సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ALSO READ:Shruti Haasan: వార్ 2 Vs కూలీ.. పోటీపై అదిరిపోయే సమాధానం ఇచ్చిన శృతిహాసన్!