Upasana -Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ramcharan) త్వరలోనే రెండోసారి తండ్రి కాబోతున్నారనే విషయం అభిమానులలో ఎంతో ఆనందాన్ని తీసుకువచ్చింది. రామ్ చరణ్ ఉపాసన (Upasana)దంపతులకు ఇదివరకే క్లిన్ కారా(Klin Kaara) కు జన్మించిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి జరిగిన 11 సంవత్సరాలకు మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో రెండు బిడ్డకు ఉపాసన జన్మనిస్తుందా లేదా అన్న సందేహాలు అందరిలోనూ కలిగాయి. కానీ ఊహించిన విధంగా ఉపాసన తన రెండో బిడ్డకు స్వాగతం చెప్పబోతున్నాం అంటూ నేడు అధికారకంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఉపాసన రెండోసారి తల్లి కాబోతున్న నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా ఆమెకు సీమంతపు వేడుకలను (Baby Shower Ceremony)నిర్వహించారు.
ఈ సీమంతపు వేడుకకు సంబంధించిన వీడియోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ బ్లెస్సింగ్స్, డబుల్ లవ్ అంటూ చెప్పడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఉపాసన ఇలా డబుల్ అని చెప్పడంతో కొంపదీసి ఉపాసన కవల పిల్లలకు(Twin Babies) జన్మనివ్వబోతుందా? అనే సందేహం కూడా అందరిలో కలిగింది. ఇలా ఉపాసన కవలలకు జన్మనివ్వబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది కానీ ఈ విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. తాజాగా ఉపాసన తల్లి శోభన కామినేని (Shobhana Kamineni) ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది అంటూ ఈమె అధికారకంగా వెల్లడించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
శోభన కామినేని ఉపాసన సీమంతపు వేడుకలకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని 2026వ సంవత్సరంలో తాము కవల పిల్లలకు స్వాగతం పలకపోతున్నామని వెల్లడించారు. తనకు 5 మంది గ్రాండ్ చిల్డ్రన్స్ ఉంటారని చెప్పడంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ అవుతుంది. అయితే ఇప్పటికే ఉపాసనకు ఒక కూతురు జన్మించగా, మరోసారి ఇద్దరు కవలలకు జన్మనివ్వబోతున్నారు అలాగే శోభన చిన్న కూతురికి కూడా ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే.
?igsh=ZjFkYzMzMDQzZg==
ఈ విధంగా శోభన కామినేని ఉపాసన కూడా కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఈసారి ఇద్దరు కవల మగ పిల్లలు జన్మిస్తారని, మెగా ఇంట్లోకి ఇద్దరు బుల్లి వారసులు రాబోతున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు చిరంజీవి ఇంట్లో అయిదుగురు పిల్లలు ఉన్నప్పటికీ ఐదుగురు కూడా అమ్మాయిలు కావటం గమనార్హం. ఈసారి తనకు మనవడు కావాల్సిందేనని చిరంజీవి రామ్ చరణ్ కి గట్టిగా చెప్పారని ఒక సందర్భంలో చిరంజీవి స్వయంగా వెల్లడించారు. మరి చిరంజీవి కోరిక మేరకు ఈసారి ఒకరు కాకుండా ఇద్దరు వారసులు రాబోతున్నారని తెలుస్తుంది . ఈసారైనా చిరంజీవి కోరిక నెరవేరేనా? లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని నెలలు వేచి ఉండాల్సిందే.
Also Read: Bison OTT: ధ్రువ్ విక్రమ్ బైసన్ ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?