E-Paper
Advertisement

లవ్ రూమర్స్.. కాబోయే వాడికి అలాంటి క్వాలిటీస్ ఉండాలంటున్న శ్రీ లీల!

లవ్ రూమర్స్.. కాబోయే వాడికి అలాంటి క్వాలిటీస్ ఉండాలంటున్న శ్రీ లీల!
Advertisement

Sree Leela:పేరుకే కన్నడ బ్యూటీ అయినా తెలుగులో వరుసగా సినిమాల చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీ లీల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అటు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ లో ఇరగదీస్తూ దూసుకుపోతున్న ఈమె.. తాజాగా పెళ్లి రిలేషన్షిప్ పై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వాస్తవానికి శ్రీ లీల గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తో లవ్ లో ఉందనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నా.. వాటిపై ఎవరో ఒకరు స్పందించి రూమర్స్ అని కొట్టి పారేస్తున్నా.. వార్తలు మాత్రం ఆగడం లేదు.

కాబోయే వాడిలో అలాంటి లక్షణాలు..

అయితే ఇలాంటి సమయంలో శ్రీలీల తాజాగా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి ? తన జీవిత భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి? అనే విషయాలపై తాజాగా స్పందించింది. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీలను రిలేషన్షిప్ అడ్వైజ్ గురించి అడగగా.. ఆమె మాట్లాడుతూ.. “నాకు కాబోయే వాడు మూడు లక్షణాలను కలిగి ఉండాలి. నాకు లైఫ్ పార్ట్నర్ గా వచ్చే వ్యక్తి చాలా సెన్సిబుల్ గా ఉండాలి. ఇతరుల భావాలను గౌరవించే సెన్సిటివ్ మనస్తత్వం అతనిలో ఉండాలి. వీటన్నింటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ అతనికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ కచ్చితంగా ఉండాలి” అంటూ శ్రీ లీల తనకు కాబోయే వాడిలో ఉండాల్సిన లక్షణాల గురించి అభిమానులతో పంచుకుంది.

నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు..

Advertisement

మొత్తానికి అయితే లుక్స్ కి మాత్రమే కాకుండా వ్యక్తిత్వానికి, ఎదుటివారిని అర్థం చేసుకునే గుణానికి తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన నెటిజన్స్.. “అబ్బాయిలు మీలో ఈ క్వాలిటీస్ ఉంటే ట్రై చేయొచ్చు” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక మరి కొంతమంది పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలు..” బాస్ ఆ క్వాలిటీస్ మనలో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే కదా” అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా శ్రీలీలా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

శ్రీలీల చిత్రాలు..

శ్రీలీల చిత్రాల విషయానికొస్తే గత ఏడాది మాస్ మహారాజా రవితేజ సరసన మాస్ జాతర, శివ కార్తికేయన్ సరసన పరాశక్తి చిత్రాలలో నటించిన ఈమె ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్ సరసన అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఒక పేరు లేని రొమాంటిక్ , మ్యూజికల్ యాక్షన్ థ్రిల్లర్ ఓం చాప్టర్ 1: ఉధిరం అనే చిత్రంలో నటిస్తోంది.

Advertisement

also read:సమంత కొత్త అవతారం.. ప్రెగ్నెన్సీలో కూడా డోంట్ కేర్!

Related News

థియేటర్లకు షాక్.. టికెట్ ధరలపై సర్కార్ కొత్త లెక్క!

వెంకీ–కళ్యాణ్ రామ్ మూవీ.. రిలీజ్ డేట్‌నే టైటిల్‌గా పెట్టేశావు కదయ్యా అనీలూ!

సుమలత ఏకపక్ష నిర్ణయం.. జానీ మాస్టర్ కి ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్!

మరో లేడీ అభిమాని కోరిక తీర్చిన రామ్ పోతినేని.. వీడియో వైరల్!

అఖండ-2, పెద్ది సినిమాలకు కొత్త రూల్‌.. 20% ఇవ్వాల్సిందే !

బ్రహ్మానందం అన్నయ్య భావోద్వేగం.. ఆ పిలుపు కోసం ఎదురు చూపంటూ..

ఫైట్ చేసిన భట్టు.. చంద్రకళ సేఫ్, మొత్తానికి ఇద్దరినీ కలిపేశారుగా!

మహాకాళి నుండి బిగ్ అప్డేట్.. మాస్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!

Big Stories

Advertisement
×