Samantha:ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత (Samantha ) ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూ మరింత బిజీగా మారిపోయింది. ఇకపోతే ఈ క్రమంలోనే ఈ ఏడాది డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తన అద్భుతమైన యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. ఇప్పటికే రూ.92 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి.. రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరడానికి సిద్ధమవుతోంది.
ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న సమంత.. తాను ప్రెగ్నెంట్ అని, కొద్దిరోజులు మెటర్నిటీ లీవ్ తీసుకుని మళ్లీ మీ ముందుకు వస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మెటర్నిటీ లీవ్ తీసుకోవడానికి ముందే మరో కీలక అడుగు వేసింది. ఇకపోతే తాను డెలివరీ అవ్వడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ సమయాన్ని వృధా చేయకుండా.. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లీవ్ తో కొత్త భాగస్వామ్యాన్ని ప్రారంభించింది. ఈ మేరకు సోనీ లివ్ తమిళ్ తో కలిసి ఒక కొత్త ప్రాజెక్టును ప్రకటించింది సమంత.. ఈ సందర్భంగా సమంతా మాట్లాడుతూ..” ఈ ఏడాది మార్పులను స్వీకరించడం.. కొత్త ఆరంభాలను ఆహ్వానించడం నాకు నేర్పింది. సోనీ లివ్ తమిళ్ తో ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం మరింత సంతోషంగా ఉంది. ఎంతో ఆసక్తికరమైన ప్రాజెక్టుపై పని చేస్తున్నాను. త్వరలోనే అన్ని విషయాలు అందరితో పంచుకుంటాను” అంటూ సమంతా తెలిపింది.. సమంత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ప్రాజెక్టులో సమంత నటిస్తున్నారా ?లేక నిర్మాతగా వ్యవహరిస్తారా? అనే విషయాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
అయితే కోలీవుడ్ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సోనీ లీవ్ లో రాబోయే కొత్త ప్రాజెక్టులో సమంత నటించడమే కాకుండా నిర్మిస్తోంది కూడా అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది లేదు సోనీ లివ్ తమిళ్ లో ప్రసారమయ్యే ఒక సెలబ్రిటీ టాక్ షో కి ఈమె హోస్ట్ గా వ్యవహరించబోతోంది అనే కామెంట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి సమంత నటిగా, నిర్మాతగా సోనీ లీవ్ తో ముందుకు నడవబోతోందా? లేక సోనీ లివ్ లో వచ్చే సెలబ్రిటీ టాక్ షోతో హోస్ట్ గా మళ్లీ ప్రేక్షకులను అలరించబోతోందా? అనేది తెలియాలి అంటే అధికారిక అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే.. బాలీవుడ్ బడా దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసిన ఈమె.. ఇప్పుడు తమ తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాదులో ఇటీవల జరిగిన మా ఇంటి బంగారం సినిమా థ్యాంక్స్ మీట్ లో తాను గర్భవతిని అని అధికారికంగా ప్రకటించిన సమంత.. ఇప్పుడు మెటర్నిటీ లీవ్ లోకి వెళ్తున్నాను.. చాలా ఆనందంగా ఉంది చిన్న విరామం తీసుకొని మళ్ళీ వస్తాను అంటూ తెలిపింది. ఇక తర్వాత సోషల్ మీడియాలో బేబీ బంప్ తో దిగిన ఫోటోని పంచుకున్న ఈమె.. “నా సిక్స్ ప్యాక్.. మళ్ళీ కలుద్దాం” అంటూ సరదాగా క్యాప్షన్ కూడా జోడించింది. అంతేకాదు జిమ్ లో బేబీ బంప్ తో వర్కౌట్స్ చేస్తూ తీసుకున్న ఫోటోని కూడా అభిమానులతో పంచుకుంది. ఏది ఏమైనా ప్రెగ్నెన్సీ ని కూడా లెక్కచేయకుండా వరుస ప్రాజెక్టులో ప్రకటిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది సమంత.
also read; జన సైనికులా? గూండాలా? ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై మండిపడ్డ ప్రకాష్ రాజ్!