E-Paper
Advertisement

Sreeleela: సినిమాలకు శ్రీలీల గుడ్ బై…షాకింగ్ డెసిషన్ తీసుకున్న నటి..అదే కారణమా?

Sreeleela: సినిమాలకు శ్రీలీల గుడ్ బై…షాకింగ్ డెసిషన్ తీసుకున్న నటి..అదే కారణమా?
Advertisement

Sreeleela: శ్రీలీల పరిచయం అవసరం లేని పేరు. నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమె ఇప్పటికీ ఒక డజనుకు పైగా సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో శ్రీలీల(Sreeleela) నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవడంతో ఈమె కెరియర్ ఇబ్బందులలో పడిందనే చెప్పాలి. ఇలా ఏ ఒక్క సినిమా కూడ శ్రీలీలకు కలిసి రాకపోవడంతో ఈమె అభిమానులు కూడా ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న శ్రీలీలకు మరొకసారి కూడా నిరాశ ఎదురయింది.

నిరాశపరిచిన ఉస్తాద్ భగత్ సింగ్..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది దీంతో లీలమ్మకు మరోసారి విమర్శలు తప్పలేదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన కెరియర్ గురించి అలాగే సోషల్ మీడియాలో వచ్చిన విమర్శల గురించి స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. శ్రీలీల కెరియర్ మొదట్లో తన గురించి వచ్చిన విమర్శలు చూసే చాలా భయం వేసిందని తెలిపారు. ఆ సమయంలో తాను సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.

ట్రోల్స్ చూసి భయపడ్డాను..

Advertisement

ఇలా సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు చూసి చాలా ఏడ్చాను, భయపడ్డాను, బాధపడ్డాను. అమ్మ దగ్గరకు వెళ్లి ఇదంతా నావల్ల అవుతుందా ? తిరిగి కాలేజీకి వెళ్లిపోనా? అంటూ బాగా ఏడ్చానని శ్రీలీల తెలిపారు. నిజానికి నేను చాలా సెన్సిటివ్ కానీ ఇప్పుడు చాలా ధైర్యం తెచ్చుకున్నానని వాటన్నింటినీ తాను ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాను అంటూ శ్రీ లీల తనపై వచ్చిన విమర్శలు గురించి ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈమెకు తెలుగులో ఒక ధమాకా సినిమా తప్ప మిగిలిన ఏ సినిమా కూడా సరైన సక్సెస్ అందించలేకపోయింది. వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ నిరాశ మాత్రమే మిగులుతుంది. ఇలా వరుస డిజాస్టర్ సినిమాలు వచ్చినప్పటికీ ఈమెకు మాత్రం అవకాశాలు కూడా కొదువ లేకుండా ఉన్నాయి.

ప్రశ్నార్థకంగా శ్రీలీల కెరియర్..

Advertisement

ప్రస్తుతం శ్రీలీలకు తెలుగులో మాత్రమే కాకుండా, తమిళంలో కూడా కూడా అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న ఈమె ప్రస్తుతం ధనుష్ సినిమాలో నటిస్తున్నారు. ఇలా తమిళ సినిమాలు ,బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ హిట్లు మాత్రం లేకపోవడంతో ఈమె కెరియర్ ప్రశ్నార్థకంగా మిగిలిందనే చెప్పాలి.

Also Read: BikerTtrailer: ఒకరిది డ్రీమ్..ఒకరిది కెరీర్ ఆసక్తికరంగా శర్వా బైకర్ ట్రైలర్..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×