E-Paper
Advertisement

రూ.200 కోట్ల ఆర్థిక దోపిడీ కేసులో నోరా ఫతేహికి ఢిల్లీ కోర్టు మరోసారి సమన్లు!

రూ.200 కోట్ల ఆర్థిక దోపిడీ కేసులో నోరా ఫతేహికి ఢిల్లీ కోర్టు మరోసారి సమన్లు!
Advertisement

Nora fatehi:రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన బాహుబలి(Bahubali )సినిమాలో “మనోహరి”సాంగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది నోరా ఫతేహి(Nora fatehi). ఒక్క పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ గ్లామర్ బ్యూటీగా పేరు సొంతం చేసుకోవడమే కాకుండా డాన్సింగ్ క్వీన్ గా కూడా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. అలాంటి ఈమె గత కొంతకాలం క్రితం సుకేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీ లాండరింగ్ దోపిడీ కేసు వ్యవహారంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి ఈమెకు ఇప్పుడు ఢిల్లీ కోర్టు ఏకంగా సమన్లు జారీ చేయడంతో నోరా ఫతేహి మరోసారి వార్తల్లో నిలిచింది. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

రూ.200 కోట్ల మనీ లాండరింగ్ దోపిడీ కేసులో నోరా ఫతేహి..

రూ.200 కోట్ల మనీ లాండరింగ్ దోపిడీ కేసు వ్యవహారంలో నోరాఫతేహి ప్రత్యక్ష సాక్షిగా కోర్టు మందు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ న్యాయస్థానం ఆదేశాల జారీ చేసింది. నవంబర్ 2న అనగా నేడు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. కానీ నోరా ఫతేహి కోర్టు విచారణకు హాజరు కాలేదు. పైగా ఆమె తరఫు న్యాయవాది ఆమె హాజరు నుండి మినహాయింపు కోరుతూ ఒక దరఖాస్తును కూడా దాఖలు చేశారు.

మరోసారి సమన్లు జారీ..

Advertisement

అయితే ఆమె హాజరు కాకపోవడంపై మండిపడ్డ న్యాయమూర్తి.. “ఆమె ఒక సాక్షి. ఒకసారి నోటీసులు పంపించిన తర్వాత కచ్చితంగా హాజరు కావాల్సిందే. కోర్టు సామాన్లు జారీ చేసిన తర్వాత కూడా ఆమె హాజరు కాలేదు అంటే.. ఆమె ప్రవర్తన ఏంటో అర్థం అవుతోంది. కోర్టును అంత తేలికగా తీసుకోవద్దు. ఆమెను కచ్చితంగా నవంబర్ 6వ తేదీన హాజరు పరచాలి “అంటూ అటు పోలీసులకు కూడా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం కొత్త సమన్లు జారీ చేసింది. మరి నవంబర్ 6 నైనా నోరాఫతేహి కోర్టు ముందు హాజరవుతుందో లేదో తెలియాల్సి ఉంది.

అసలేం జరిగిందంటే?

ఇకపోతే ఈ కేసుకు సంబంధించి దాఖలైన మూడో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో నోరా ఫతేహినీ ప్రాసిక్యూషన్ సాక్షిగా పేర్కొన్నారు. 2020 -21 కాలంలో సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీలోని రోహిణి జైల్లో ఉంటూనే ఉన్నతాధికారుల పేర్లతో నకిలీ అవతారం ఎత్తాడు. ర్యాన్ బాక్సీ మాజీ ప్రమోటర్ సివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ ను బెదిరించి, ఆమె భర్తను జైలు నుంచి విడిపిస్తానని నమ్మబలికి సుమారుగా 200 కోట్లను దోచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ దందాపై ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం సమగ్ర దర్యాప్తు చేపట్టి మహారాష్ట్ర కంట్రోలర్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద అభియోగాలు నమోదు చేసింది.

Advertisement

ALSO READ:ఝాన్సీ ఎలిమినేషన్ కి ముఖేష్ కారణమా.. హీటెక్కిన నామినేషన్ వార్!

ప్రత్యక్ష సాక్షిగా నోరా ఫతేహి..

ఈ దర్యాప్తులో భాగంగా సుఖేష్ చంద్రశేఖర్ , అతని భార్య లీనా మరియా పాల్ తో ఉన్న సంబంధాలపై ఈఓడబ్ల్యూ గతంలోనే నోరా ఫతేహినీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఆ సమయంలో సీఆర్సీపీ సెక్షన్ 164 కింద ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అయితే నోరా ఫతేహి మాత్రం సుఖేష్ తో తనకు పరిచయం లేదని, అతడి భార్య ద్వారానే మాట్లాడానని, డిసెంబర్ 2020లో చెన్నైలో జరిగిన ఒక ప్రైవేటు ఈవెంట్ లో పాల్గొనడానికి మాత్రమే వెళ్లానని, ఆమె అధికారులకు వివరణ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈమె సాక్షి కావడంతో ఆమె వాంగ్మూలం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Related News

నెపోటిజం చూపిస్తున్న నిహారిక.. న్యాయం కావాలంటూ రోడ్డెక్కిన టీమ్!

ఫేక్ గురూ అంటూ పూనమ్ కౌర్ మరో షాకింగ్ పోస్ట్!

అబ్బా.. ఏం అందం! ప్రిన్సెస్‌లా మారిపోయిన రవీనా కూతురు!

రాజీవ్ వర్మ, మలైకా జంటగా కొత్త సినిమా ప్రారంభం.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనూప్ రూబెన్స్!

ఆర్జీవీ, గోపాల్ రెడ్డి మధ్య గొడవ.. కొట్టుకునే వరకు వెళ్లిందా? శివ నాగేశ్వరరావు షాకింగ్ కామెంట్స్!

ఎవరిని అడిగి నా పాట పెట్టారు.. ఆదర్శ కుటుంబం పై జిమ్ జిమ్ తార ఫేమ్ లక్ష్మీ ఆంటీ ఫైర్!

రూ.40 కోట్ల టార్గెట్.. కల్ట్ ఇప్పటివరకు కొట్టిందెంత?

Big Stories

Advertisement
×