E-Paper
Advertisement

ఆర్జీవీ, గోపాల్ రెడ్డి మధ్య గొడవ.. కొట్టుకునే వరకు వెళ్లిందా? శివ నాగేశ్వరరావు షాకింగ్ కామెంట్స్!

ఆర్జీవీ, గోపాల్ రెడ్డి మధ్య గొడవ.. కొట్టుకునే వరకు వెళ్లిందా? శివ నాగేశ్వరరావు షాకింగ్ కామెంట్స్!
Advertisement

Siva Nageswara Rao:వెంకటేష్, శ్రీదేవి జంటగా నటించిన ‘క్షణక్షణం’  రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా, గోపాల్ రెడ్డి నిర్మాత అన్న సంగతి తెల్సిందే. అప్పట్లో ఈ సినిమా షూటింగ్ కోసం ముదుమలై అడవికి వెళ్లాలని, అక్కడ దాదాపు 10 నుంచి 12 రోజుల పాటు షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారట కో డైరెక్టర్ శివ నాగేశ్వరరావు.

ఈ క్రమంలో షూటింగ్‌లో ఓ అడవి పంది కావాలని రామ్ గోపాల్ వర్మ అడిగారట. దాని కోసం ఓ వ్యక్తిని కలిస్తే రూ.10 వేలు ఖర్చవుతుందని చెప్పాడట. అయితే ఆ పంది ట్రైనింగ్ తీసుకున్నది కాదని, కెమెరా ముందు నుంచి వెళ్లమంటే వెళ్తుందో లేదో కూడా తెలియదని చెప్పడంతో శివ నాగేశ్వరరావు ఆ ఆలోచనను పక్కన పెట్టేశారట. అంత డబ్బు పెట్టి తీసుకొచ్చినా ఉపయోగం లేకపోతే ఎలా అని అనుకున్నామని ఆరోజులని గుర్తుచేసుకున్నారు

Advertisement

ఇక అడవిలో కొన్ని సీన్స్ తీయడానికి 118 లేదా జిప్సీ కావాలని రాము చెప్పారట. ఏది కావాలో ముందే చెప్పాలని శివ నాగేశ్వరరావు అడిగినా.. రెండు వెహికల్స్ తీసుకురావాలని రామ్ గోపాల్ వర్మ చెప్పడం తో ఏం చేయాలో అర్థంకాక అలాగే రెండు వెహికల్స్ కావాలని ప్రొడక్షన్ టీమ్‌కు చెప్పాల్సి వచ్చిందట.

ఈ విషయం నిర్మాత గోపాల్ రెడ్డి తెలీడంతో ఆయనకు కోపం వచ్చిందట. రెండు వెహికల్స్ అంత దూరం తీసుకెళ్లాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా? పెట్రోల్ ఖర్చులు, ట్రక్ అద్దె అన్నీ ఉంటాయి కదా.. ముందే ఏదో ఒకటి ఫైనల్ చేయకుండా రెండు వాహనాలు ఎందుకు అడిగారని శివ నాగేశ్వరరావు పై మండిపడ్డారట.

Advertisement

దానికి శివ నాగేశ్వరరావు కూడా రామ్ గోపాల్ వర్మను చాలాసార్లు అడిగానని, కానీ ఏదీ సరిగ్గా చెప్పడం లేదని వివరించారట. ఈ విషయం జరిగిన తర్వాత రాము అక్కడికి వచ్చి గోపాల్ రెడ్డి తనతో గొడవపడినట్లు తెలిసిందని అడిగారట. అయితే శివ నాగేశ్వరరావు మాత్రం నిర్మాత తప్పేమీ లేదని చెప్పారట. తాను నిర్మాత ప్లేస్ లో ఉన్నా ఖర్చుల గురించి ఇలాగే ఆలోచిస్తానని స్పష్టం చేశారట.

ఆ తర్వాత ఏ వెహికల్ తీసుకెళ్తే బాగుంటుందని రాము అడగ్గా.. జిప్సీనే మంచిదని షూటింగ్ లో కెమెరా పెట్టుకోవడానికి, ఆర్టిస్టులు కూర్చోవడానికి జిప్సీలో కంఫర్ట్ ఎక్కువగా ఉంటుందని వివరించారట. పైగా ఖర్చు కూడా తక్కువ అవుతుందని చెప్పడంతో రాము కూడా ఒకే చెప్పారట.

అయితే శివ నాగేశ్వరరావు నిర్మాతతో మాట్లాడిన తీరుకు రామ్ గోపాల్ వర్మ హ్యాపీగా ఫీల్ అయ్యారట.తన కోసం గోపాల్ రెడ్డితో గొడవ పెట్టుకోకుండా, ఆయన తప్పేమీ లేదని చెప్పినందుకు మెచ్చుకున్నారట. అంతేకాదు, ఇకపై తనతోనే ఉండాలని, తాను చేసే ప్రతి సినిమాకు పనిచేయాలని కోరారట. మంచి రెమ్యునరేషన్ ఇస్తానని, కో-డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇలా ఏ పోస్ట్ కావాలన్నా ఇస్తానని చెప్పారట.

కానీ శివ నాగేశ్వరరావు మాత్రం తనకు దర్శకుడు కావాలనే కోరిక ఉందని , తాను మద్రాస్‌కు వచ్చింది సినిమా డైరెక్ట్ చేయడానికేనని, ముందుగా ఒక సినిమా చేసి తనను తాను నిరూపించుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారట. ఒకవేళ తన సినిమా ఫ్లాప్ అయితే అప్పుడు రాము ఇచ్చిన ఆఫర్ గురించి ఆలోచిస్తానని సరదాగా అన్నారట శివ నాగేశ్వరరావు.దాంతో రామూనే తను దర్శకుడు అవ్వడానికి సాయపడ్డాడట

అలా ‘క్షణక్షణం’ షూటింగ్‌లో జిప్సీ, 118 వెహికల్స్ విషయంలో మొదలైన చిన్న గొడవ చివరకు శివ నాగేశ్వరరావు దర్శకుడిగా మారడానికి దారి తీసిందంటూ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తిగా చెప్పుకొచ్చారు శివ నాగేశ్వరరావు.

ALSO READ :రూ.40 కోట్ల టార్గెట్.. కల్ట్ ఇప్పటివరకు కొట్టిందెంత?

Tags

Related News

ఎవరిని అడిగి నా పాట పెట్టారు.. ఆదర్శ కుటుంబం పై జిమ్ జిమ్ తార ఫేమ్ లక్ష్మీ ఆంటీ ఫైర్!

రూ.40 కోట్ల టార్గెట్.. కల్ట్ ఇప్పటివరకు కొట్టిందెంత?

చిరు మెగావర్స్ ప్రోమో కోసం హరీష్ శంకర్.. బిగ్ ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్!

ఆ సినిమా జ్ఞాపకాల్లో మునిగిపోయిన శివాత్మిక.. స్పెషల్ ఫొటో షేర్

RC17ప్రీ లుక్ పోస్టర్ తోనే హైప్ పెంచిన సుక్కు… చరణ్ రోల్ అదేనా?

ఇండస్ట్రీలో మరీ మంచితనం పనికిరాదు.. జ్యోతి పూర్వాజ్ షాకింగ్ కామెంట్స్!

స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న రన్యారావుకి రాజ మర్యాదలు..అసలేం జరుగుతోంది?

Big Stories

Advertisement
×