E-Paper
Advertisement

ఎవరిని అడిగి నా పాట పెట్టారు.. ఆదర్శ కుటుంబం పై జిమ్ జిమ్ తార ఫేమ్ లక్ష్మీ ఆంటీ ఫైర్!

ఎవరిని అడిగి నా పాట పెట్టారు.. ఆదర్శ కుటుంబం పై జిమ్ జిమ్ తార ఫేమ్ లక్ష్మీ ఆంటీ ఫైర్!
Advertisement

Jim Jim Tara Singer Lakshmi Devi: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా నిలిచిన పాటలలో జిమ్ జిమ్ తార పాట(Jim Jim tara Song) ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంస్టాగ్రామ్ లో సరదాగా వీడియోలు చేసుకుంటున్న లక్ష్మీదేవి(Lakshmi Devi) అనే మహిళ చిన్నప్పుడు వారు పాడుకునే పాటలను సరదాగా పాడటంతో ఇది కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారడమే కాకుండా పర్ణశాల(Parnashala) సినిమాలో ఇదే పాటను పెడుతూ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ పాటను సింగర్ లక్ష్మీదేవి చేత పాడించిన సంగతి తెలిసిందే.

ఆదర్శ కుటుంబం పై లక్ష్మీ ఆంటీ ఫైర్..

ఇక పర్ణశాల సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే జిమ్ జిమ్ తార పాటను విడుదల చేయగా మంచి ఆదరణ సొంతం చేసుకుంది .కానీ ఇటీవల వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదర్శ కుటుంబం సినిమాలో జిమ్ జిమ్ తారా పాటను 15 సెకండ్లు ఉపయోగించారు అయితే ఎలాంటి అనుమతి లేకుండా ఈ పాట వాడటంతో పర్ణశాల నిర్మాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆదర్శ కుటుంబం మ్యూజిక్ డైరెక్టర్ పట్ల ఒరిజినల్ సింగర్ లక్ష్మీ ఆంటీ స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.

ఎవరి అనుమతి తీసుకున్నారు..

Advertisement

ఈ వీడియోలో భాగంగా లక్ష్మీ ఆంటీ మాట్లాడుతూ.. వెంకటేష్ తీసిన ఆదర్శ కుటుంబం సినిమాలో జిమ్ జిమ్ తార పాటను 15 సెకండ్లు పెట్టారు. ఈ సినిమా వాళ్లు పర్ణశాల సినిమా వాళ్లకు డబ్బులు ఇచ్చారా? లేకపోతే నాకు డబ్బులు ఇచ్చారా? మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు పైకి వెళ్తుండాలి చిన్నోళ్ళు కిందకి పడిపోతూ ఉండాలి. మీరు ఈ సినిమాలో పాట పెట్టుకుంటే డబ్బులు ఇచ్చినా పర్ణశాల సినిమా వారికి నష్టాలు రావా? ఎవరి అనుమతి తీసుకొని మీరు ఆ పాట పెట్టారు? మీరు వెంటనే ఆ పాటను తీసేయాలి లేదంటే కేసు వేస్తానని లక్ష్మీ ఆంటీ ఆదర్శ కుటుంబం సినిమా టీంకు వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

మీరు ఇచ్చే డబ్బులు మాకు వద్దు అలాగే పర్ణశాల సినిమా వాళ్లకు వద్దు మీరు మాత్రం మా పాటలను ఉపయోగించి ఫేమస్ అవ్వాలి కానీ మాకు మాత్రం తినడానికి కూడా ఇబ్బందికరంగా మారిపోతోందని లక్ష్మీ ఆంటీ తెలిపారు. ఇప్పటికైనా ఆదర్శ కుటుంబం సినిమాలో జిమ్ జిమ్ తార పాటను తీసేయాలి లేదంటే పర్ణశాల సినిమా వారితో కలిసి నేను కేసు వేస్తానని, ఈ సందర్భంగా లక్ష్మీ ఆంటీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి మరి ఈమె చేసిన వ్యాఖ్యల పట్ల ఆదర్శ కుటుంబం టీమ్ స్పందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: చిరు మెగావర్స్ ప్రోమో కోసం హరీష్ శంకర్.. బిగ్ ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్!

Related News

ఆర్జీవీ, గోపాల్ రెడ్డి మధ్య గొడవ.. కొట్టుకునే వరకు వెళ్లిందా? శివ నాగేశ్వరరావు షాకింగ్ కామెంట్స్!

రూ.40 కోట్ల టార్గెట్.. కల్ట్ ఇప్పటివరకు కొట్టిందెంత?

చిరు మెగావర్స్ ప్రోమో కోసం హరీష్ శంకర్.. బిగ్ ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్!

ఆ సినిమా జ్ఞాపకాల్లో మునిగిపోయిన శివాత్మిక.. స్పెషల్ ఫొటో షేర్

RC17ప్రీ లుక్ పోస్టర్ తోనే హైప్ పెంచిన సుక్కు… చరణ్ రోల్ అదేనా?

ఇండస్ట్రీలో మరీ మంచితనం పనికిరాదు.. జ్యోతి పూర్వాజ్ షాకింగ్ కామెంట్స్!

స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న రన్యారావుకి రాజ మర్యాదలు..అసలేం జరుగుతోంది?

Big Stories

Advertisement
×