E-Paper
Advertisement

చిరు మెగావర్స్ ప్రోమో కోసం హరీష్ శంకర్.. బిగ్ ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్!

చిరు మెగావర్స్ ప్రోమో కోసం హరీష్ శంకర్.. బిగ్ ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్!
Advertisement

Chiru Megaverse: మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా ఇది వరకే మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే తాజాగా మరొక కార్యక్రమం కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Net Flix)వేదికగా చిరు హోస్ట్ గా ‘మెగావర్స్ ‘(Megaverse) అనే సెలబ్రిటీ టాక్ షో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షో కి సంబంధించి అధికారకంగా నెట్ ఫ్లిక్స్ తెలియచేశారు. ఇక ఈ సెలబ్రిటీ టాక్ షోలో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్ కు సంబంధించి ఇదివరకే ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి.

పస్ట్ ఎపిసోడ్ గెస్ట్ లుగా మెగా హీరోలు..

ఈ సెలబ్రిటీ టాక్ షోలో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్ కోసం మెగా హీరోలు హాజరు కాబోతున్నారనే వార్త కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మొదటి ఎపిసోడ్ లో పాల్గొనబోతున్నారనే విషయం అభిమానులలో మరింత ఉత్సాహాన్ని, ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదేవిధంగా ఈ టాక్ షోలో పాల్గొనబోయే సెలబ్రిటీ గెస్ట్ లకు సంబంధించిన లిస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా మెగావర్స్ టాక్ షో కి సంబంధించి మరొక వార్త బయటకు వచ్చింది.

హరీష్ శంకర్ చిరకాల కోరిక నెరవేరిందా…

Advertisement

ఈ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో షూటింగ్ నవంబర్ 4వ తేదీ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుందని సమాచారం. ఈ ప్రోమో వీడియో డైరెక్టర్ చేసే అవకాశాన్ని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar) దక్కించుకున్నారని తెలుస్తోంది. హరీష్ శంకర్ మెగా ఫ్యాన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పటినుంచో చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలనే ఆయన కోరుకుంటున్నారు. ఇక చిరంజీవి గారిని పూర్తి సినిమాలో దర్శకత్వం వహించకపోయినా ఇలా స్పెషల్ టాక్ షో ప్రోమో డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో హరీష్ శంకర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నట్లు సమాచారం.

మెగావర్స్ షోలో ప్రభాస్..

చిరంజీవిలోని పాత తరం మాస్‌ స్వాగ్‌, స్టైలిష్‌ లుక్‌, ప్రత్యేకమైన స్క్రీన్‌ ప్రెజెన్స్‌ను హరీష్‌ శంకర్ చూపించబోతున్నారని తెలుస్తోంది.ఆయన మార్క్‌ పంచ్‌లు, భారీ విజువల్స్‌తో ఈ ప్రోమోను ప్రత్యేకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా హరీష్ శంకర్ బాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకోవటంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సెలబ్రిటీ టాక్ షోలో భాగంగా ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోలతో పాటు బ్రహ్మానందం, సునీల్, సత్య వంటి కమెడియన్స్ కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం 15 ఎపిసోడ్లతో ఈ టాక్ షో నిర్వహించబోతున్నారు.

Advertisement

Also Read: RC17ప్రీ లుక్ పోస్టర్ తోనే హైప్ పెంచిన సుక్కు… చరణ్ రోల్ అదేనా?

Related News

ఆర్జీవీ, గోపాల్ రెడ్డి మధ్య గొడవ.. కొట్టుకునే వరకు వెళ్లిందా? శివ నాగేశ్వరరావు షాకింగ్ కామెంట్స్!

ఎవరిని అడిగి నా పాట పెట్టారు.. ఆదర్శ కుటుంబం పై జిమ్ జిమ్ తార ఫేమ్ లక్ష్మీ ఆంటీ ఫైర్!

రూ.40 కోట్ల టార్గెట్.. కల్ట్ ఇప్పటివరకు కొట్టిందెంత?

ఆ సినిమా జ్ఞాపకాల్లో మునిగిపోయిన శివాత్మిక.. స్పెషల్ ఫొటో షేర్

RC17ప్రీ లుక్ పోస్టర్ తోనే హైప్ పెంచిన సుక్కు… చరణ్ రోల్ అదేనా?

ఇండస్ట్రీలో మరీ మంచితనం పనికిరాదు.. జ్యోతి పూర్వాజ్ షాకింగ్ కామెంట్స్!

స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న రన్యారావుకి రాజ మర్యాదలు..అసలేం జరుగుతోంది?

Big Stories

Advertisement
×