Cult Movie Collections:అక్టోబర్ 30న థియేటర్లలో ఆదర్శ కుటుంబం సినిమాతో పాటు బరిలోకి దిగిన మరో సినిమా విశ్వక్ సేన్ కల్ట్ .వరుస ప్లాపులని ఫేస్ చేస్తున్న విశ్వక్ ఈసారైనా ఒడ్డున పడ్డాడా ?విశ్వక్‌సేన్ స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్లు రాబడుతోంది? ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూలు చేసింది? అంటూ ఆసక్తిగా ఆరాలు తీస్తున్నారు మూవీ లవర్స్.
అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మిక్స్‌డ్ టాక్ రావడం గమనార్హం.ఒకవైపు జైలర్ 2, రణబాలి, ఆదర్శ కుటుంబం వంటి సినిమాలు థియేటర్ లలో ఉండటంతో మాస్ కా దాస్ కల్ట్ కి గట్టి పోటీనే ఎదురవుతున్నట్టు కనిపిస్తుంది.
సాధారణ హారర్ సినిమాలకు భిన్నంగా స్లాషర్ జానర్‌లో ఈ సినిమాని తెరకెక్కించాడు విశ్వక్.ఇందులో విశ్వక్‌సేన్ కి జోడీగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటించారు. మురళి శర్మ, తారక్ పొన్నప్ప, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, విశాఖ్ నాయర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇక తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకర్ల ఈ సినిమాను నిర్మించారు.ఇక ఈ సినిమాకి KGF ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించడం విశేషం.
ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కల్ట్ సినిమా బడ్జెట్ సుమారు రూ.35 కోట్లు అని ఇన్ సైడ్ టాక్.ఇక ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా రూ.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది.అంటే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారు రూ.22 కోట్ల షేర్, రూ.42 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుందన్న మాట. అయితే వాలకం చూస్తుంటే యా టార్గెట్ అందుకోవడం కాస్త కష్టమనే టాక్ వినిపిస్తుంది.
మొదటి రోజు కల్ట్ సినిమాకు ఇండియాలో రూ.90 లక్షల నెట్ వసూళ్లు వస్తే రెండో రోజు రూ.1.20 కోట్లకు చేరినట్టు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.దీంతో రెండు రోజుల్లో ఇండియాలో మొత్తం దాదాపు గా రూ.2 కోట్ల నెట్, రూ.2.35 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇండియా, ఓవర్సీస్ కలెక్షన్లు కలిపి రెండో రోజు ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.2.70 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు వార్తలు విన్పిస్తున్నాయి.అయితే మూడో రోజు సండే అవడం చేత కలెక్షన్స్ పెరుగుతాయని ఆశపడుతున్నారు మేకర్స్.మరి వారి అంచనాలని అందుకుంటూ మూడు రోజుల్లో 5 కోట్లని అయినా దాటుతుందా లేదా చూడాలి.
అయితే అసలు పరీక్ష సోమవారం నుంచి మొదలవబోతుంది, వీకెండ్‌లో వచ్చే కలెక్షన్లతో పాటు, వర్కింగ్ డేస్‌లో కూడా ఆడియన్స్ థియేటర్ లలోకి వస్తేనే సినిమా ఏమైనా గట్టున పడే అవకాశాలు ఉన్నాయి.చూడాలి ఈ మాస్ కా దాస్ ప్లాపుల పరంపరకి ఈ సినిమా తో నైనా ఎండ్ కార్డ్ వేస్తాడో లేదో !
ALSO READ :ఆ సినిమా జ్ఞాపకాల్లో మునిగిపోయిన శివాత్మిక.. స్పెషల్ ఫొటో షేర్