Rajeev Varma:సకల సమృద్ధి ఆర్ట్స్ బ్యానర్‌పై కొత్త సినిమా మొదలైంది. గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రొడక్షన్ నంబర్ 1 మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. హీరో రాజీవ్ వర్మ, హీరోయిన్ మలైకా టి. వాసుపాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు నిర్మాత కనుమూరి ప్రసాద్ రాజు నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో
పలువురు సినీ ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఇక ఈ సినిమా ప్రారంభోత్సవంలో హీరో రాజీవ్ వర్మ, హీరోయిన్ మలైకా టి. వాసుపాల్‌పై షూట్ చేసిన మొదటి సీన్ కి ఆస్కార్ లిరిసిస్ట్ చంద్రబోస్ క్లాప్ కొట్టడం విశేషం.ఇక నిర్మాత కనుమూరి ప్రసాద్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు గౌతమ్ ప్రసాద్ యల్లపు ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు.
ఈ సినిమాతో గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే కూడా ఆయనే అందిస్తుండటం విశేషం. కుటుంబ నేపథ్యంలో సాగే ఓ అందమైన లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో రాజీవ్ వర్మకు జోడీగా మలైకా టి. వాసుపాల్ నటిస్తున్నారు. వీరిద్దరి జంట ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. వీరితో పాటు అజయ్ ఘోష్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, కుమనన్ అలియాస్ రమణ, జెమిని సురేష్, రమణ భార్గవ్, శివాజీ రాజా, ఆయూషి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే తమ నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటీనటులంతా ఒకే సినిమాలో కనిపించనుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది .ఇక ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
ఇక ఈ సినిమా షూటింగ్ నవంబర్ 12 నుంచి హైదరాబాద్‌లో మొదలుకానుంది. మొత్తం నాలుగు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత మిగిలిన షూటింగ్‌ను కోనసీమ పరిసర ప్రాంతాల్లో చేయనున్నారు.ప్రస్తుతం పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనుందట మూవీ టీమ్
చూడాలి. కొత్త దర్శకుడిగా గౌతమ్ ప్రసాద్ యల్లపు తన మొదటి సినిమాతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారో, రాజీవ్ వర్మ, మలైకా టి. వాసుపాల్ జంటగా ఎలా మెప్పిస్తారు? అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకు ఎంత ప్లస్ అవుతుందో!
ALSO READ :సదన్నకు అంత క్రేజ్ తెచ్చిన వీడియోలు ఇవే.. చూస్తే నవ్వాపుకోలేరు!