IND VS AUS: టీం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India) పరువు అంతర్జాతీయంగా పోయేలా ఆస్ట్రేలియా వ్యవహరిస్తోంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( India vs Australia) మధ్య అడిలైడ్ ( Adelaide Oval ) వేదికగా రేపు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే పెర్త్ తరహా లోనే అడిలైడ్ లో కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయట. నిన్న కాస్త చిరుజల్లులు కూడా పడినట్లు సమాచారం. దీంతో గ్రౌండ్ ను ఆరబెట్టేందుకు అధునాతన టెక్నాలజీని క్రికెట్ ఆస్ట్రేలియా ఉపయోగిస్తోంది. యువి లైట్స్ టెక్నాలజీని వాడి, గ్రౌండ్ మొత్తం ఆరబెట్టింది క్రికెట్ ఆస్ట్రేలియా. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Also Read: Team India -Divorce: విడాకులు తీసుకున్న మరో టీమిండియా ప్లేయర్…భార్య లేకుండానే దీపావళి వేడుకలు
ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలిపై దారుణంగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా రూ.658 కోట్ల ఆదాయంతో ఉంది. అదే భారత క్రికెట్ నియంత్రణ మండలి 18వేల 760 కోట్ల ఆదాయం కలిగి ఉంది. ఇలాంటి నేపథ్యంలో మన ఇండియాలో వర్షం పడితే, టేబుల్ ఫ్యాన్లు, ఇస్త్రీ పెట్టెలు, హెయిర్ డ్రాయర్లు వాడుతోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం యూవీ లైట్స్ వాడడమే బీసీసీఐ పరువు పోవడానికి కారణం. వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ బీసీసీఐ ఇలాంటి టెక్నాలజీ ఎందుకు వాడడం లేదని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఆస్ట్రేలియా లాంటి టెక్నాలజీని మీరు కూడా వాడండి.. ఇంకెప్పుడూ అప్డేట్ అవుతారని క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అంతర్జాతీయంగా ఇండియా పరువు పోతుందని.. వేలకోట్ల ఆస్తులు ఏం చేస్తున్నారని బీసీసీఐని నిలదీస్తున్నారు భారత అభిమానులు.
రేపు టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( India vs Australia) మధ్య రెండవ వన్డే జరగనుంది. అడిలైడ్ ( Adelaide Oval, Adelaide ) వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే పెర్త్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్ పూర్తికాగా అందులో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. రేపు అడిలైడ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. పెర్త్ తరహాలోనే అడిలైడ్ లో కూడా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో రేపటి మ్యాచ్ కు కూడా వర్షం అడ్డంకి గా మారుతుందని అంచనా వేస్తున్నారు. అంటే టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేయడం మంచిదని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ ఓడిపోతే టీమిండియా సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆచితూచి ఆడాల్సి ఉంది.