Illu Illalu Pillalu Today Episode October 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ మాత్రం ధీరజ్ పై రోజు రోజుకి ప్రేమను పెంచుకుంటుంది. ఎలాగైనా సరే ధీరజ్ ని నా సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. ప్రేమ మాత్రం ధీరజ్ని ఎలాగైనా సరే తన వైపు తిప్పుకోవాలని తన గురించి ఆలోచించేలా చేయాలని మౌనంగా ఉంటుంది. ఇక ధీరజ్ కూడా ఏమాత్రం తగ్గకుండా పెర్ఫార్మెన్స్ ఇరగదీస్తాడు. ప్రేమకు కావాలని కోపం తెప్పించాలని ఐశ్వర్యతో మాట్లాడినట్లు నటిస్తాడు. అది నిజమేననుకునే నమ్మిన ప్రేమ వాళ్ళిద్దరు సంగతి తేలుస్తాను అని సీరియస్ అవుతుంది. ఆనందరావు మాత్రం మేము స్వయంకృషితో పైకి వస్తాము. ఇడ్లీలతో ఫైనాన్స్ బిజినెస్ చేస్తాము అని కోతలు కోస్తాడు. రామరాజు ఎంత చెప్తున్నా సరే ఆనందరావు వినకపోవడంతో రామరాజు మీ పట్టుదలతోనే మీరు సాధిస్తారు. భాగ్యం ఆనందరావు రామరాజు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా చేయడంతో కోపంతో రగిలిపోయి అతన్ని కొట్టేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… ప్రేమ వద్దని చెప్తున్న సరే ధీరజ్ మాత్రం కొత్త జాబు నేను జాయిన్ అవ్వాలి అని ఆ జాబ్ లో జాయిన్ అవుతాడు. మొదటి పికప్ ఒక అమ్మాయికి రావడంతో వాళ్ల నాన్న ధీరజ్ ను చూసి టెన్షన్ పడతాడు. తన కూతురు అతనితో వెళ్తే సేఫ్ గా ఉంటుందా లేదా అని ఆ తండ్రి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాడు. మొత్తానికి ధీరజ్ తో పంపించడానికి అతను ఒప్పుకుంటాడు. ఆ తర్వాత షేరింగ్ కావడంతో దారి మధ్యలో మరో ఇద్దరూ అబ్బాయిలు ఎక్కుతారు. వాళ్ళు ఆ అమ్మాయిని చూసి తేడాగా ప్రవర్తిస్తారు. ఆ అమ్మాయి ఇబ్బంది పడుతూ ఉంటుంది. వాళ్ళని చూసిన ధీరజ్ కచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు.
శ్రీవల్లి అమూల్యను బయటికి పంపించడం పై ఏదో ఉంది అని ప్రేమకు అనుమానం కలుగుతుంది. అసలు నువ్వు జాతరలో తప్పిపోవడం వెనక ఎవరు కారణం అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రేమ. ఆరోజు నువ్వు జాతరలో ఒక్కదానివే బయటికి వెళ్లడం వెనక ఎవరున్నారు అని ప్రేమ అడుగుతుంది. అమూల్య శ్రీవల్లి వదిన నన్ను తీసుకొని వెళ్ళింది వదిన.. ఆ తర్వాత మీ అన్నయ్య నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు అప్పుడే ధీరజ్ అన్నయ్య చూసి కొట్టాడు.
అసలు ఈ మధ్య మీ అన్నయ్య నాతో మాట్లాడటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ రోజు జాతరలో కూడా అంతే నాతో మాట్లాడడమే కాదు. నువ్వు మా మామయ్య కూతురువి నీకు గాజులు కనిపిస్తాను అని నా చేయి పట్టుకున్నాడు అది చూసే ధీరజ్ అన్నయ్య కొట్టాడు అని ప్రేమతో అంటుంది. శ్రీవల్లి నా పేరు అమూల్య చెప్పేసింది. ఇది తాగేసి నా మెడ మీద కత్తి పెడుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రేమ ఆరోజు తాగేసి నాకు విశ్వరూపం చూపించింది. ఇవాళ కూడా తాగేసి నన్ను చిత్రహింసలు పెడుతుందేమో అని శ్రీవల్లి భయపడుతూ ఉంటుంది.
Also Read : కోడళ్ల మాటతో పార్వతి షాక్.. పల్లవి పై కమల్ సీరియస్..అవనికి పల్లవి ఝలక్..
శ్రీవల్లి ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రేమ ప్రత్యక్షమవుతూ కంటి చూపుతోనే భయపెడుతూ ఉంటుంది. శ్రీవల్లి ఏంటి ప్రేమ నేను నిజం చెప్పిన కూడా నీ కంటి చూపుతోని చంపేస్తున్నావేంటి అని అడుగుతుంది. నీ మీద నాకు డౌట్ ఉంది అని ప్రేమ అనగానే శ్రీవల్లి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది. ఇంట్లో మందు తాగేది కేవలం మావయ్య గారు ఒక్కరే. ఆ బాటిల్ అన్నిటిని దాచేస్తే ప్రేమకు మందు దొరకదు కదా ఎలా తాగుతుంది. నేను తప్పించుకోవచ్చని శ్రీవల్లి ప్లాన్ చేస్తుంది. మొత్తానికి మందు బాటిల్స్ అన్నిటిని దాచేస్తుంది.. ధీరజు తన కస్టమర్ కి ఏదో ప్రమాదం ఉందని తెలుసుకొని ఆమెను సేఫ్ గా వారి ఇంటి దగ్గరలో డ్రాప్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి ఫ్రెండ్స్ మళ్లీ వచ్చి అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడంతో అది చేసింది ధీరజ్ అని తన తండ్రి పోలీస్ కేసు పెట్టే అవకాశం ఉంది. ప్రేమ నమ్మకమే నిజమైందా..? లేదా ధీరజ్ నమ్మకమే నిజమవుతుందా అన్నది రేపు ఏం జరుగుతుందో చూడాలి..