Rohit Sharma: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) రిటైర్మెంట్ పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్… అవుతున్నాయి. 2027 వరల్డ్ కప్ వరకు ఆడి ఆ తర్వాత రిటైర్మెంట్ ఇవ్వాలని రోహిత్ శర్మ ప్లాన్ లో ఉన్నాడని మొన్నటి వరకు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో.. రోహిత్ శర్మ… మరో 10 ఏళ్లపాటు టీం ఇండియాలో కొనసాగాలని… చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) స్టార్ట్ ఆటగాడు ఖలీల్ అహ్మద్ ( Khaleel Ahmed) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2035 వరకు రోహిత్ శర్మ టీమిండియా జట్టులో కొనసాగితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఈ సందర్భంగా వెల్లడించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలర్ ఖలీల్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: IND Vs PAK : ఆసియా కప్ లో పాక్ vs ఇండియా మ్యాచ్ షెడ్యూల్ లో మార్పు.. కొత్త టైమింగ్ ఇదే!
రోహిత్ శర్మ మరో 10 ఏళ్ళు క్రికెట్ ఆడాలి
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మరో 10 సంవత్సరాల పాటు ఆడాలని చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ వ్యాఖ్యానించారు. రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ అలాగే అలాంటి వ్యక్తిని తాను ఎప్పుడూ చూడలేదని కొనియాడారు. ఆయనంటే తనకు చాలా గౌరవమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సరిగ్గా ఆడనప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడి మోటివేట్ చేసే అలవాటు రోహిత్ శర్మకు మాత్రమే ఉందని.. ఈ సందర్భంగా ఖలీల్ అహ్మద్ పేర్కొన్నారు. ఇటీవల నేషనల్ క్రికెట్ అకాడమీలో రోహిత్ శర్మను కలిశానని.. ఆ సమయంలో రోహిత్ శర్మ చాలా ఫీడ్ గా ఉన్నాడని.. గుర్తు చేశారు. తన కెప్టెన్సీ లోనే తాను టీమిండియాలోకి అరంగేట్రం చేసినట్లు కూడా గుర్తు చేశారు ఖలీల్ అహ్మద్.
20 రోజుల్లో 22 కిలోలు తగ్గిన రోహిత్ శర్మ
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ… ఇటీవల భారీగా బరువు తగ్గాడు. చాలా స్లిమ్ అయ్యాడు. ఏకంగా… 22 కిలోలు తగ్గిపోయాడు. కేవలం 20 రోజుల్లోనే రోహిత్ శర్మ కసరత్తులు చేసి 22 కిలోలు తగ్గడం చాలా గ్రేట్ అని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. సెప్టెంబర్ 13వ తేదీన రోహిత్ శర్మకు బ్రాంకో అలాగే యోయో టెస్టులు ఉన్నాయి. ఈ టెస్టుల్లో పాస్ అయితేనే టీమిండియాలోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తాడు రోహిత్ శర్మ. అందుకు తగ్గట్టుగానే… తాజాగా బరువు తగ్గాడు. ఇలాంటి నేపథ్యంలోనే రోహిత్ శర్మ 10 సంవత్సరాల పాటు టీమిండియాలో కొనసాగాలని ఖలీల్ అహ్మద్ పేర్కొన్నాడు.
Also Read: David Warner : మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో విలన్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్?
Khaleel said "It was during 2018-19 when I started out under the captaincy of Rohit Sharma in the Asia Cup. He gave me a lot of confidence, in spite of me being a junior to him, he made me aware of the fact that I have something special in me. Such a successful cricketer taking… pic.twitter.com/N5yVoPR8VS
— Johns. (@CricCrazyJohns) September 2, 2025