E-Paper
Advertisement

పెద్ది సినిమాపై జాన్వీ కపూర్ విమర్శలు.. శృతిహాసన్ స్లిప్పర్ షాట్ సమాధానం!

పెద్ది సినిమాపై జాన్వీ కపూర్ విమర్శలు.. శృతిహాసన్ స్లిప్పర్ షాట్ సమాధానం!
Advertisement

Sruthi Hassan: శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈమె దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ఆకాశంలో ఒక తార అనే సినిమాలో కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందేమో ప్రమోషన్లలో భాగంగా శృతిహాసన్(Sruthi Hassan) వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు యాంకర్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురయింది. గత కొద్దిరోజులుగా యాంకర్లు సినీ సెలెబ్రిటీలను ప్రశ్నలు అడుగుతూ వారిని ఇరకాటంలో పెడుతున్నారు.

స్పెషల్ సాంగ్స్ గ్లామర్ కోసమేనా..

తాజాగా శృతిహాసన్ విషయంలో కూడా ఇదే జరిగింది పెద్ది సినిమా(peddi movie)లో స్పెషల్ సాంగ్ చేయడం గురించి ప్రశ్నలు వేయడంతో శృతిహాసన్ తనదైన శైలిలోనే సమాధానం చెబుతూ యాంకర్ నోరు మూయించారు. పెద్ది సినిమాలో తనని చూపించిన విధానం గురించి డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఇటీవల జాన్వి కపూర్(jhanvi kapoor) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే అయితే శృతిహాసన్ పరోక్షంగా ఈమె వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ మాట్లాడుతూ పెద్ద సినిమాలో స్పెషల్ సాంగ్ మీరు ఏ కోణంలో చూస్తారు.. ఇలాంటి పాటలను గ్లామర్ కోసమే పెడతారనే సంగతి మీకు తెలుసు కదా అంటూ ప్రశ్న వేశారు.

డాన్స్ చేయటం చాలా ఇష్టం..

Advertisement

ఈ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ… నాకు డాన్స్ చేయడం చాలా ఇష్టం డాన్స్ చేయడం కోసం అందంగా రెడీ అవ్వడం కూడా చాలా ఇష్టమని , తాను ఈ కోణంలోనే పెద్ది స్పెషల్ సాంగ్ చూస్తానని శృతిహాసన్ తెలిపారు. గ్లామర్ విషయంలో నా ఆలోచన విధానం నాకు పూర్తి స్వేచ్ఛను ఇస్తుందని ఈమె తెలియజేశారు. ఇక డ్రెస్సింగ్ స్టైల్ గురించి కూడా మాట్లాడుతూ నేను ఏదైనా డ్రెస్ వేసుకుంటే కంఫర్ట్ ఉండాలని కోరుకుంటాను నేను వేసుకున్నాను అంటే అది నాకు కంఫర్ట్ ఉన్నట్లేనని తెలిపారు. నచ్చకపోతే నేను వేసుకోనని మొహమాటం లేకుండా చెబుతానని శృతిహాసన్ తెలిపారు.

నాకు కంఫర్ట్ ఉంటేనే చేస్తాను…

ఒకవేళ తాను ఆ డ్రెస్ వేసుకొని డాన్స్ చేశాను అంటే ఆ అడ్రస్ నాకు పూర్తిగా సౌకర్యవంతంగా ఉన్నట్లేనని ఈమె చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా శృతిహాసన్ ఈ సమాధానం ద్వారా ఒకవైపు ప్రశ్న అడిగిన యాంకర్ అలాగే గతంలో ఈ సినిమా గురించి విమర్శలు కురిపించిన జాన్వి కపూర్ ఇద్దరికీ గట్టి సమాధానం ఇచ్చిందని చెప్పాలి. ఇక పెద్ది స్పెషల్ సాంగ్లో శృతిహాసన్ తో పాటు జాన్వి కపూర్ కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: రెండు సినిమాలు బ్లాక్ బస్టర్.. ఇష్ట దైవాన్ని దర్శించుకున్న సాయి పల్లవి!

Related News

రెండు సినిమాలు బ్లాక్ బస్టర్.. ఇష్ట దైవాన్ని దర్శించుకున్న సాయి పల్లవి!

మళ్లీ వెండితెరపైకి ఎన్టీఆర్.. ఈసారి ఏఐ టెక్నాలజీతో!

బిగ్‌బాస్ ఫేమ్ సిరి హన్మంత్ లేటెస్ట్ పోస్ట్.. ఆ ఒక్క లైన్ ఇప్పుడు ఫుల్ వైరల్!

ఆకాశంలో ఒక తార.. 18 వెర్షన్ల తర్వాత తెరపైకి వచ్చిన కథ!

లక్ష రూపాయల ఖర్చు, మూడేళ్ల ఆర్థిక కష్టాలు.. ‘అమృతం’ వెనుక ఇంత కథ ఉందా?

టీజర్ వద్దు.. ట్రైలర్ తో కొడదాం.. అలియాస్ రుక్మిణి ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చేస్తున్నాడు.. ఫ్యామిలీ ప్యాక్ టీజర్ అదిరిందిగా!

Big Stories

Advertisement
×