E-Paper
Advertisement

ఆకాశంలో ఒక తార.. 18 వెర్షన్ల తర్వాత తెరపైకి వచ్చిన కథ!

ఆకాశంలో ఒక తార.. 18 వెర్షన్ల తర్వాత తెరపైకి వచ్చిన కథ!
Advertisement

Aakasamlo Oka Tara:తాజాగా విడుదలైన ‘ఆకాశంలో ఒక తార’ సినిమాకు గున్నం గంగరాజు స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూల్లని రాబడుతుండటంతో తాజాగా ఈ సినిమా గుర్తించి పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చారు.అసలు ఈ సినిమా కథ ఎలా తనవద్దకి వచ్చిందో, ఎలా కష్టపడ్డారో ఈ సందర్భంగా వివరించారు.

గంగరాజు మాట్లాడుతూ దర్శకుడు పవన్ ఈ కథను సన్నీ ద్వారా తన కొడుకు సందీప్ దగ్గరకు తీసుకువస్తే, సందీప్ తనకు వినిపించారని తెలిపారు. కథ వినగానే నచ్చిందని, కానీ అప్పట్లో అనుకున్న ‘కల్పన’ అనే టైటిల్‌ను మార్చాల్సిన అవసరం ఉందనిపించడంతో ‘ఆకాశంలో ఒక తార’ అనే పేరును పెట్టామని చెప్పారు.

Advertisement

కేవలం రెండు పేజీల కథను పూర్తి సినిమాగా మార్చడానికి ఏకంగా 18 వెర్షన్ల స్క్రీన్‌ప్లే, డైలాగ్ డ్రాఫ్ట్స్ రాశామని వివరించారు. సాధారణంగా తన సినిమాలకు పది వెర్షన్ల వరకు రాస్తానని, కానీ ఈ కథ 14 ఏళ్ల కాలాన్ని కవర్ చేయడం, అందులోని సైన్స్, టెక్నాలజీ అంశాలను సామాన్య ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం పెద్ద సవాలుగా మారిందని అన్నారు.

అందుకే సినిమాలో పాత్రల చిన్ననాటి నేపథ్యం,, హీరో జర్నీ, హీరోయిన్ జీవితంలోని మలుపులను విడివిడిగా డెవలప్ చేశామని, సినిమాను గుజరాత్ నేపథ్యంలో మొదలుపెట్టడం వల్ల కథకు మంచి బ్యాక్ డ్రాప్ దొరికిందని తన అభిప్రాయాన్ని చెప్పారు.

Advertisement

ఇక ఈ సినిమాలో తనకు బాగా నచ్చిన పాత్ర కృష్ణ అని కల్పన కృష్ణను ‘కృష్ణ గారు’ అని పిలవడం వెనుక ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి కావడం, అతనిపై ఉండే గౌరవం, కొంత భయం వంటి కారణాలు ఉన్నాయని వివరించారు. అలాగే బిజిలీ పాత్రను కేవలం ఫ్లాష్‌బ్యాక్ చెప్పే పాత్రగా కాకుండా, ఒక బలమైన ఎమోషన్ ఉండేలా తీర్చిదిద్దామన్నారు. సినిమాల్లో అక్క, వదిన పాత్రలను నెగెటివ్‌గా చూపించకుండా ప్రతి పాత్ర వెనుక ఒక పరిస్థితి ఉండేలా రాశామని తెలిపారు.

ఎవరో ఒకరు తోడుగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రయాణం చేయగలరు కానీ, నమ్ముకున్న వాళ్లు కూడా అండగా నిలవనప్పుడు తనకు తానే బలంగా నిలబడి ముందుకు వెళ్లడమే అసలైన గొప్పతనమని కల్పన పాత్ర ద్వారా చెప్పాలనుకున్నట్లు గంగరాజు వివరించారు. అయితే కల్పన చివరి జర్నీని ఇంకాస్త బలంగా, డ్రమటిక్‌గా చూపించి ఉంటే బాగుండేదని, సినిమా చూశాక తన పనికి తానే మార్కులు వేసుకుంటే 100కి 70 మాత్రమే ఇస్తానని చెప్పుకొచ్చారు గంగరాజు.

ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో మాస్ యాక్షన్, థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ నడుస్తున్నా, ఇలాంటి సెన్సిబుల్ ఎమోషనల్ కథను ఎందుకు ఎంచుకున్నామో ఇలా వివరించారు.ప్రేక్షకులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని, మంచి కథ వస్తే జనం తప్పకుండా ఆదరిస్తారని చెప్పారు. ముఖ్యంగా ‘నీ చూపు ఆకాశం వైపు ఉన్నప్పుడు ఈ భూమితో నాకేం పని’ అనే డైలాగ్‌కు థియేటర్లలో వచ్చిన చప్పట్లు, విజిల్స్ తనను ఆశ్చర్యపరిచాయని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు గంగరాజు .

ALSO READ:అవనీత్ కౌర్ అందానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. లేటెస్ట్ పోస్ట్ వైరల్!

Tags

Related News

లక్ష రూపాయల ఖర్చు, మూడేళ్ల ఆర్థిక కష్టాలు.. ‘అమృతం’ వెనుక ఇంత కథ ఉందా?

టీజర్ వద్దు.. ట్రైలర్ తో కొడదాం.. అలియాస్ రుక్మిణి ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చేస్తున్నాడు.. ఫ్యామిలీ ప్యాక్ టీజర్ అదిరిందిగా!

అవనీత్ కౌర్ అందానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. లేటెస్ట్ పోస్ట్ వైరల్!

రూ.60 కోట్ల బడ్జెట్.. రూ.100 కోట్ల టార్గెట్.. ఆకాశంలో ఒక తార పరిస్థితి ఏంటి?

వృషకర్మ కోసం నాగచైతన్య షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎంతంటే?

పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయతి!

Big Stories

Advertisement
×