E-Paper
Advertisement

మళ్లీ వెండితెరపైకి ఎన్టీఆర్.. ఈసారి ఏఐ టెక్నాలజీతో!

మళ్లీ వెండితెరపైకి ఎన్టీఆర్.. ఈసారి ఏఐ టెక్నాలజీతో!
Advertisement

Senior NTR:టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెగ చక్కర్లు కొడుతోంది.అవును .. సీనియర్ ఎన్టీఆర్‌ను ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వినిపిస్తుంది.ఇక ఇదే విషయాన్ని ప్రముఖ ఏఐ నిపుణుడు డాక్టర్ కళ్యాణం శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు.

ఏఐ ద్వారా మళ్ళీ

Advertisement

గతంలోనే కొంతమంది నిర్మాతలు ఎన్టీఆర్, శ్రీదేవి లాంటి దిగ్గజాలను ఏఐ ద్వారా మళ్ళీ తెరపైకి తీసుకురావచ్చా అని తనను అడిగారని ఆయన చెప్పారు. టెక్నాలజీ పరంగా ఇది సాధ్యమే కానీ, చట్టపరంగా వాళ్ళ కుటుంబ సభ్యులు లేదా వారసుల పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాలి. అయితే, ఎన్టీఆర్ సినిమా విషయంలో నిర్మాతలు ఇప్పటికే ఆయన వారసుల అనుమతి తీసుకున్నారని, వారి పర్మిషన్ తోనే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తోందని శ్రీనివాస్ తెలిపారు.

ఈ టెక్నాలజీ మన ఇండస్ట్రీకి రావడానికి మరో ఐదేళ్లు పడుతుందనుకున్నా కానీ, ఇంత త్వరగా లైన్ లోకి రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అయితే ఈ సినిమా కథ ఏంటి, డైరెక్టర్ ఎవరు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే వివరాలు మాత్రం ఇంకా అఫీషియల్ గా చెప్పకపోవడం గమనార్హం.

Advertisement

‘డిజిటల్ లైక్నెస్’

ఏఐ అంటే కేవలం ఒక నటుడి ముఖాన్ని కంప్యూటర్‌లో క్రియేట్ చేయడం కాదని, ఒకప్పుడు ఆ నటుడు ఎలా నడిచేవారు, ఎలా మాట్లాడేవారు, ఆయన ఎక్స్ప్రెషన్స్ ,బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండేవి అనే మొత్తం విషయాలను పాత ఫొటోలు, వీడియోల ఆధారంగా మళ్ళీ సృష్టించాలని దీన్నే ‘డిజిటల్ లైక్నెస్’ అంటారని వివరించారు.

దీనివల్ల వయసు పైబడిన హీరోలను కూడా వాళ్ళ 20 ఏళ్ల వయసులో ఉన్నప్పటిలా చూపించే అవకాశం ఉంటుందని ,ఇక భవిష్యత్తులో ఇది తెలుగు సినిమా మార్కెట్‌నే మార్చేయొచ్చని అంచనా వేశారు.ఇక ఇప్పుడున్న స్టార్ హీరోల రెమ్యునరేషన్లు, కాల్షీట్ల సమస్యలు లేకుండా, కేవలం లైసెన్స్ ఒప్పందాలతో వాళ్ళ డిజిటల్ రూపాలను వాడుకునే రోజులు రావచ్చని చెప్పుకొచ్చారు.

ఏఐతో సినిమా తీయడం అంటే

మరోవైపు, ఏఐతో సినిమా తీయడం అంటే ఏదో నాలుగు పదాలు టైప్ చేసి వీడియోలు జనరేట్ చేయడం కాదని కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు రాసుకోవడం అంతా పాత పద్ధతిలోనే ఉంటుంది కాని స్క్రిప్ట్‌ను విజువల్స్‌గా మార్చడంలో మాత్రమే ఏఐ సాయం తీసుకుంటారని భారీ గ్రాఫిక్స్, ఫాంటసీ వరల్డ్ ని తక్కువ బడ్జెట్‌లో, తక్కువ టైంలో క్రియేట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇక ఇప్పటికే తాను ‘మాయా పొట్టలు’ అనే ప్రాజెక్ట్ పూర్తి చేశానని, మరిన్ని వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తున్నానని ఆయన తెలిపారు. ప్రస్తుతం వస్తున్న కొన్ని సినిమాల్లో కూడా ఏఐ వాడుతున్నారని, కాకపోతే లైవ్ షూటింగ్‌తో ఏఐ విజువల్స్ కలిపేటప్పుడు లైటింగ్, కలర్స్ సరిగ్గా మ్యాచ్ అవ్వకపోతే తేడా తెలిసిపోతుందని చెప్పారు. అలాగే, పర్మిషన్ లేకుండా నటుల గొంతులు, ముఖాలు వాడటంపై లీగల్ గా చిక్కులు వస్తున్నాయని, అందుకే సరైన అగ్రిమెంట్లు ముఖ్యమని సూచించారు.

ఏది ఏమైనా, పెద్ద ఎన్టీఆర్‌ను మళ్ళీ వెండితెరపై చూడటం అనేది అభిమానులకు, కొత్త తరం ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతని చెప్పక్కర్లేదు. చూడాలి మరి ఏఐ సృష్టించే ఎన్టీఆర్ రూపం తెరపై ఎలా ఉండబోతుందో !

ALSO READ:బిగ్‌బాస్ ఫేమ్ సిరి హన్మంత్ లేటెస్ట్ పోస్ట్.. ఆ ఒక్క లైన్ ఇప్పుడు ఫుల్ వైరల్!

Tags

Related News

బిగ్‌బాస్ ఫేమ్ సిరి హన్మంత్ లేటెస్ట్ పోస్ట్.. ఆ ఒక్క లైన్ ఇప్పుడు ఫుల్ వైరల్!

ఆకాశంలో ఒక తార.. 18 వెర్షన్ల తర్వాత తెరపైకి వచ్చిన కథ!

లక్ష రూపాయల ఖర్చు, మూడేళ్ల ఆర్థిక కష్టాలు.. ‘అమృతం’ వెనుక ఇంత కథ ఉందా?

టీజర్ వద్దు.. ట్రైలర్ తో కొడదాం.. అలియాస్ రుక్మిణి ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చేస్తున్నాడు.. ఫ్యామిలీ ప్యాక్ టీజర్ అదిరిందిగా!

అవనీత్ కౌర్ అందానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. లేటెస్ట్ పోస్ట్ వైరల్!

రూ.60 కోట్ల బడ్జెట్.. రూ.100 కోట్ల టార్గెట్.. ఆకాశంలో ఒక తార పరిస్థితి ఏంటి?

Big Stories

Advertisement
×