Sai Pallavi: సినీనటి సాయి పల్లవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఓకే నెలలో సాయి పల్లవి నటించిన రామాయణ(Ramayana) సినిమాతో పాటు ధనుష్ (Dhanush)ప్రధాన పాత్రలో నటించిన ఓం చాప్టర్ 1 సినిమాలో కూడా నటించారు. ఈ రెండు సినిమాలు ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఇలా సాయి పల్లవి నటించిన ఈ రెండు సినిమాలు విడుదల అనంతరం సాయి పల్లవి సత్య సాయి బాబా (Satya Sai Baba) మహాసమాధిని దర్శించుకున్నారు.
ప్రస్తుతం పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి బాబా 101వ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పుట్టపర్తి( Puttaparthi)లోని సాయిబాబా జయంతి వేడుకలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.. ఇటీవల రష్మిక మందన్న సైతం పుట్టపర్తికి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా సాయి పల్లవి సైతం శ్రీ సత్య సాయి బాబా జయంతి వేడుకలలో పాల్గొంటూ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఇక ఈ వేడుకలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలలో సాయి పల్లవి పాల్గొన్నారు.
ఇక సత్య సాయి బాబా మందిరంలో సాయి పల్లవి ఒక సెలబ్రిటీ హోదాలో కాకుండా ఒక సాధారణ భక్తురాలిలాగా భక్తుల మధ్యలో కూర్చుని నమస్కరించుకున్నారు. ఇక సాయి పల్లవి పుట్టపర్తి వెళ్లడం ఇది మొదటిసారి కాదు ప్రతి ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా ఈమె పుట్టపర్తికి వెళ్లి సత్య సాయి బాబా మహాసమాధిని దర్శించుకుంటారు. సెలబ్రిటీలందరూ విదేశాలలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికితే సాయి పల్లవి మాత్రం ఎంతో భిన్నంగా పుట్టపర్తికి వెళ్లి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు పాల్గొంటూ ఉంటారు. తనకు సత్య సాయి బాబాకి విడదీయరాని బంధం ఉందని పలు సందర్భాలలో సాయి పల్లవి తెలిపారు.
తన అమ్మకు పిల్లలు పుడితే సాయిబాబా పేరు పెట్టుకుంటానని చెప్పడంతోనే తన పేరుకు ముందు సాయి అని ఉందంటూ ఈమె గతంలో తెలిపారు. అందుకే ప్రతి ఏడాది సాయి పల్లవి పుట్టపర్తిని సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. సత్య సాయి బాబా జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో ఈ జయంతి వేడుకలలో ఈమె పాల్గొన్నారు. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు సౌత్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్, పాన్ ఇండియా సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇక రామాయణ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి త్వరలోనే ఈ సీక్వెల్ సినిమా పనులలో బిజీ కానున్నారు.
Also Read: ఏంటీ రష్మిక ముఖేష్ గౌడ్ మధ్య అలాంటి రిలేషన్ ఉందా? బిగ్ బాస్ వేదికపై బయటపడ్డ నిజం!