Understanding children feelings| పిల్లలు రోజంతా ఎన్నో విషయాలను ఎదుర్కొంటారు. స్కూల్‌లో స్నేహితులతో గొడవలు, టీచర్ల ప్రశంసలు, కొత్త విషయాలు నేర్చుకోవడం.. ఇలా ఎన్నో అనుభవాలు వారికి ఎదురవుతుంటాయి. కానీ, ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు మాత్రం చాలామంది పిల్లలు సమాధానం చెప్పరు. చెప్పినా చాలా క్లుప్తంగా ముగించేస్తారు. తమ బాధలను, సంతోషాలను మనసులోనే దాచుకుంటారు. అలాంటప్పుడు పిల్లల మనసులో ఏముందో తల్లిదండ్రులు ఎలా తెలుసుకోవాలి? ప్రతిరోజూ కొన్ని చిన్న ప్రశ్నలు అడిగితే పిల్లలు తమ భావాలను స్వేచ్ఛగా షేర్ చేసుకుంటారు. ఆ 5 ప్రశ్నలు ఇవే
ఈ ప్రశ్నతో పిల్లలతో సంభాషణ ప్రారంభించండి. పాఠశాలలో జరిగిన మంచి విషయాలను గుర్తుచేసుకునే అవకాశం వారికి లభిస్తుంది. స్నేహితుడితో ఆడుకున్న ఆటలు, టీచర్ నుంచి లభించిన ప్రశంసలు లేదా కొత్తగా నేర్చుకున్న విషయం గురించి పిల్లలు చెబుతారు. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. మధ్యలో అడ్డుకోవద్దు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి చిన్న ప్రశ్నలు అడగండి. ఇలా చేస్తే పిల్లలు తమ అనుభవాలను ఆనందంగా పంచుకుంటారు.
పిల్లలు కూడా రోజూ ఎన్నో భావోద్వేగాలను ఎదుర్కొంటారు. స్నేహితులు బాధపెట్టడం, చదువులో ఇబ్బందులు ఎదురవడం వంటి కారణాలతో పిల్లలు నిరాశ చెందవచ్చు. వారి బాధను తక్కువగా చూడకండి. వెంటనే మందలించడం లేదా తప్పుపట్టడం చేయకండి. ప్రశాంతంగా విని, వారి భావాలను అర్థం చేసుకోండి. ఇలా చేస్తే సమస్యలను మీతో చెప్పడానికి వారు భయపడరు.
పిల్లలు పుస్తకాల నుంచే కాకుండా ఆటలు, స్నేహితులు, రోజువారీ అనుభవాల నుంచి కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఈ ప్రశ్న ద్వారా వారి ఆసక్తులు, ప్రతి రోజు చేసే యాక్టివిటీస్ గురించి తెలుసుకోవచ్చు. వారు చెప్పే విషయాలను ఆసక్తిగా వినండి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రోత్సహించండి.
Also Read: భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఈ పని చేస్తే సరి.. బంధం మరింత బలపడుతుంది
చిన్నప్పటి నుంచే పిల్లలకు దయ, సహాయం చేసే అలవాట్లను తల్లిదండ్రులు నేర్పించాలి. స్నేహితుడికి సహాయం చేశారా, తోబుట్టువులతో ఏదైనా ఫుడ్ షేర్ చేసుకున్నారా? అని అడగండి. వారు చేసిన మంచి పనులను అభినందించండి. ఇతరులకు చిన్న సహాయం చేసినా ఎంతో ఆనందం కలుగుతుందని వివరించండి. అయితే, సమాధానం చెప్పమని బలవంతం చేయకండి.
ఈ ప్రశ్న పిల్లల రేపటి ఆలోచనలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. స్నేహితులను కలవడం, స్కూల్ ప్రొగ్రామ్ లేదా కుటుంబంతో బయటకు వెళ్లడం గురించి చెప్పే అవకాశం ఉంది.
కొన్నిసార్లు పరీక్షలు, పాఠశాల వంటి విషయాలపై భయాలు కూడా బయటపడవచ్చు. వారి ఆందోళనలను శ్రద్ధగా విని, ధైర్యం చెప్పండి.
Also Read: ప్రతి చిన్న విషయానికి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? కోపంలో ఈ 5 మాటలు అసలు చెప్పకండి
ఈ 5 ప్రశ్నలు పిల్లలతో అనుబంధాన్ని పెంచుతాయి. అయితే, వారిని ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా ప్రశ్నలు అడగకండి. భోజన సమయంలో లేదా నిద్రపోయే ముందు ప్రశాంతంగా మాట్లాడండి.
వారు చెప్పేది ఓపికగా వినండి. వెంటనే సమాధానం చెప్పమని ఒత్తిడి చేయకూడదు. వారి భావాలను గౌరవించండి. ఇలా ప్రతిరోజూ మాట్లాడటం వల్ల తల్లిదండ్రుల పట్ల పిల్లల్లో నమ్మకం పెరుగుతుంది. తమ సంతోషాలు, బాధలు, భయాలను తల్లిదండ్రులతో చెప్పడానికి వారు మరింత ధైర్యం చూపుతారు.