E-Paper
Advertisement

టీజర్ వద్దు.. ట్రైలర్ తో కొడదాం.. అలియాస్ రుక్మిణి ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..

టీజర్ వద్దు.. ట్రైలర్ తో కొడదాం.. అలియాస్ రుక్మిణి ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..
Advertisement

Alias Rukmini Trailer : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ వరుస డిజాస్టర్ సినిమాలను ఎదుర్కొంటున్నారు. ఇలా వరుస సినిమాలు నిరాశపరిచినప్పటికీ ఈయన మాత్రం సరికొత్త సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక త్వరలోనే నితిన్ (Nithin)అలియాస్ రుక్మిణి (Alias Rukmini)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మురళి కాంత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా నాని (Nani) సమర్పణలో విడుదల కానుంది.

ట్రైలర్ ముహూర్తం ఫిక్స్..

ఈ సినిమాలో నాని జోడిగా బాలీవుడ్ బ్యూటీ అఫియా సయ్యద్(Afia sayad) హీరోయిన్ గా నటించబోతున్నారు. ఈ సినిమాలో ఈమె టీచర్ పాత్రలో కనిపించబోతున్నట్టు ఇదివరకే విడుదల చేసిన అప్డేట్స్ ద్వారా తెలియజేశారు. ఇప్పటివరకు అలియాస్ రుక్మిణి సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ మేకర్స్ తెలియజేశారు. అయితే ఈ సినిమాకు టీజర్ లేకుండా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు నాని తెలియజేశారు.

వద్దు వర్క్ అవుట్ అవ్వదు.. ఎక్స్పీరియన్స్ చేశాను..

Advertisement

నాని డైరెక్టర్ ఇద్దరు మాట్లాడుతూ ఈ సినిమాకు ట్రైలర్ లేకుండా విడుదల చేద్దాం అంటూ డైరెక్టర్ అడగగా వెంటనే నాని మాట్లాడుతూ.. వద్దు వర్క్ అవుట్ అవ్వదు.. ఎక్స్పీరియన్స్ చేశాను అని చెప్పగా వెంటనే డైరెక్టర్ మరి టీజర్ లేకుండా ట్రైలర్ రిలీజ్ చేద్దామా అని చెప్పడంతో వెంటనే నాని టీజర్ వద్దు.. డైరెక్ట్ ట్రైలర్ తోనే కొడదాం అంటూ ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 26వ తేదీ విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్ బ్యానర్ పై దీప్తి గంట నిర్మాతగా వ్యవహరించగా నాచురల్ స్టార్ నాని సమర్పణలో ఈ సినిమా విడుదల కాబోతోంది.

Advertisement

ఇక ఈ సినిమా డిసెంబర్ నాలుగో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం తెలియచేసినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఈ ట్రైలర్ అప్డేట్లో భాగంగా ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ రాబోతుందని మరోసారి విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పులు లేవని, ముందుగా అనుకున్న ప్రకారమే డిసెంబర్ 4న యధావిధిగా విడుదల కాబోతుందని స్పష్టమవుతుంది. మరి ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అలియాస్ రుక్మిణి ద్వారా నితిన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా సక్సెస్ నితిన్ కెరీర్ కి కూడా ఎంతో కీలకంగా మారబోతుందని చెప్పాలి.

Also Read: వృషకర్మ కోసం నాగచైతన్య షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎంతంటే?

Related News

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చేస్తున్నాడు.. ఫ్యామిలీ ప్యాక్ టీజర్ అదిరిందిగా!

అవనీత్ కౌర్ అందానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. లేటెస్ట్ పోస్ట్ వైరల్!

రూ.60 కోట్ల బడ్జెట్.. రూ.100 కోట్ల టార్గెట్.. ఆకాశంలో ఒక తార పరిస్థితి ఏంటి?

వృషకర్మ కోసం నాగచైతన్య షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎంతంటే?

పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయతి!

హమ్మయ్య.. దేవర సాటిలైట్ రైట్స్ కు లైన్ క్లియర్.. టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధం!

టాలీవుడ్‌ను ఏలుతున్న తెలంగాణ దర్శకులు.. ఎవరి రెమ్యునరేషన్ ఎంతంటే?

Big Stories

Advertisement
×