E-Paper
Advertisement

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చేస్తున్నాడు.. ఫ్యామిలీ ప్యాక్ టీజర్ అదిరిందిగా!

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చేస్తున్నాడు.. ఫ్యామిలీ ప్యాక్ టీజర్ అదిరిందిగా!
Advertisement

Family Pack:శ్రీవిష్ణు..కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ అంటూ టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ క్రేజీ స్టార్ తాజాగా మరో మరోసారి సాలిడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు.
సామజ వరగమన అంటూ నవ్వుల వర్షంలో ముంచెత్తిన కాంబోలో మరోసారి ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే సినిమాతో ఆడియన్స్ ని అలరించబోతున్నాడు.

ఇక ఇప్పటికే పొంగల్ బరిలో దిగబోతున్న ఈ సినిమా నుండి తాజాగా అఫీషియల్ టీజర్‌ను వదిలింది మూవీ టీమ్. టైటిల్‌లోనే ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండబోతుందని హింట్ ఇచ్చిన మేకర్స్ టీజర్ కూడా అదే రేంజ్‌లో ఫన్ సీన్స్, కామెడీ, ఎమోషన్స్‌తో నింపేసిందని చెప్పాలి.

Advertisement

ఇక ఇందులో కథ మొత్తం ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ చుట్టూ తిరుగుతుందని టీజర్‌ చూస్తే అర్థం అవుతుంది. ముఖ్యంగా శ్రీవిష్ణు కనిపించిన తీరు, పోలీస్ డ్రెస్ లో చెప్పిన డైలాగ్స్ ,నరేష్ ఫ్యామిలీ స్టోరీ ఆడియన్స్‌లో నవ్వులు పూయించడం పక్కా .

ఇక శ్రీవిష్ణు సినిమాలను చూస్తే ఆయన ఎంచుకునే కథల్లో వెరైటీ ఉంటుందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ ఒకేలా కాకుండా కామెడీ, థ్రిల్లర్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లాంటి డిఫరెంట్ స్టోరీలతో ఆడియన్స్‌ను ఎంటర్ టైన్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

Advertisement

ముఖ్యంగా ‘సామజవరగమన’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో సాలిడ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాలో ఫ్యామిలీ రిలేషన్స్ బ్యాక్ డ్రాప్ లో శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో మెప్పించిన శ్రీవిష్ణు ‘స్వాగ్’ సినిమాతో తనలోని మరో యాంగిల్ ని ఆడియన్స్ కి పరిచయం చేశాడు. ఇప్పుడు ‘ఫ్యామిలీ ప్యాక్’తో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేశాడని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

ఇక టీజర్‌లో కనిపించిన విజువల్స్, సీన్స్‌కు తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయనే చెప్పాలి ముఖ్యంగా కథలోని ప్రతి క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉన్నట్లు చూపించడం మరో హైలైట్‌గా మారిందనడం లో సందేహం లేదు. కేవలం హీరో చుట్టూనే కథను తిప్పకుండా ఫ్యామిలీలోని మిగతా క్యారెక్టర్ల ద్వారా కూడా కామెడీ పండించే ప్రయత్నం చేయడంలో డైరెక్టర్ రామ్ అబ్బరాజు సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది.

ఇక  సినిమా విషయానికి వస్తే ఇందులో శ్రీవిష్ణుకి జోడీగా  సాక్షి మధోల్కర్ నటించనుండగా నరేష్, అభిరామి, మురళీ శర్మ, అన్నపూర్ణమ్మ, వెన్నెల కిషోర్, సత్య, రోహిణి, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, గోపరాజు విజయ్, నెల్లూరు సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా చైతన్ భరద్వాజ్ సంగీతం జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ALSO READ:అప్పుడు గాజులు గలగల.. ఇప్పుడు అయ్యప్ప మాల.. మళ్లీ వచ్చేసిందే!

మొత్తానికి ‘ఫ్యామిలీ ప్యాక్’ టీజర్‌తో శ్రీవిష్ణు మరోసారి తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆడియన్స్ కి చూపించబోతున్నాడన్న మాట.చూడాలి మరి సామజవరగమన అంటూ ఆకట్టుకున్న ఈ కాంబో ఈ సారి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో పొంగల్ కి తేలిపోనుంది !

Tags

Related News

టీజర్ వద్దు.. ట్రైలర్ తో కొడదాం.. అలియాస్ రుక్మిణి ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..

అవనీత్ కౌర్ అందానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. లేటెస్ట్ పోస్ట్ వైరల్!

రూ.60 కోట్ల బడ్జెట్.. రూ.100 కోట్ల టార్గెట్.. ఆకాశంలో ఒక తార పరిస్థితి ఏంటి?

వృషకర్మ కోసం నాగచైతన్య షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎంతంటే?

పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయతి!

హమ్మయ్య.. దేవర సాటిలైట్ రైట్స్ కు లైన్ క్లియర్.. టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధం!

టాలీవుడ్‌ను ఏలుతున్న తెలంగాణ దర్శకులు.. ఎవరి రెమ్యునరేషన్ ఎంతంటే?

Big Stories

Advertisement
×