Anasuya:బుల్లితెర యాంకర్ గా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన అనసూయ(Anasuya ).. ప్రస్తుతం వెండితెర మీద కూడా అలరిస్తోంది. అలా సినిమాల్లోకి రాకముందు విఎఫ్ఎక్స్ కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గా కూడా వర్క్ చేసిన ఈమె.. సాక్షి న్యూస్ ప్రెజెంటర్ గా కూడా పనిచేసింది. చివరికి మా మ్యూజిక్ లో యాంకర్ గా చేసి అప్పటినుండి బుల్లితెర మీద యాంకర్ గా అలరించింది. ఇక ఎన్ని చేసినా అనసూయ కి క్రేజ్ అయితే రాలేదు. కానీ ఎప్పుడైతే ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్ గా చేసిందో.. అప్పటినుండి ఈమె దశ మారిపోయిందని చెప్పుకోవచ్చు.
ఒకవైపు జబర్దస్త్.. మరోవైపు వరుస సినిమాలు..
అలా జబర్దస్త్ యాంకర్ అనగానే అనసూయ పేరు వినిపించేలా ఈమె క్రేజ్ మార్మోగిపోయింది.అయితే అలాంటి అనసూయ జబర్దస్త్ తరువాత సోగ్గాడే చిన్నినాయన,క్షణం, రంగస్థలం,విమానం, పుష్పక విమానం, పుష్ప, పుష్ప-2 వంటి సినిమాలు చేసి సినిమాల్లో యాక్టివ్ అయింది. ఎప్పుడైతే వెండితెర మీద పలు పాత్రలు పోషించి సినిమాల్లో అలరించిందో.. అప్పటి నుండి అనసూయ యాంకరింగ్ రంగానికి గుడ్ బై చెప్పింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి వెళ్తూ భారీగా డబ్బులు సంపాదిస్తోంది.
అదే మెయిన్ టార్గెట్ అంటున్న అనసూయ..
ఇక చూస్తుంటే అనసూయ మెయిన్ టార్గెట్ అదేనేమో అన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కొక్క షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్తే దాదాపు కోట్లలో రెమ్యూనరేషన్ ఇస్తారు. అందుకోసమే షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి వెళ్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. ఆ మధ్యకాలంలో ఎక్కువగా బుల్లితెర మీద సందడి చేసిన అనసూయ.. ఒక్కసారిగా బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి.. పూర్తిగా వెండితెర మీద లేకపోతే ఈవెంట్స్ వంటివి చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది. అయితే గత కొద్దిరోజుల నుండి అనసూయ ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కు వెళ్తోంది. అందులో భాగంగానే.. నిన్న అనంతపురం గుంతకల్లులోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లి అక్కడ సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. తన క్యూట్ మాటలతో ఎంతోమందిని మెస్మరైజ్ చేసింది.
వరుస షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ తో బిజీగా మారిన అనసూయ..
మళ్ళీ ఈరోజు నందిగామలోని షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్తున్నాను అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకి తెలియజేసింది. అలా వెంట వెంటనే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళ్తూ డబ్బులు సంపాదిస్తోంది అనసూయ.. కేవలం సినిమాలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మకి ఉన్న క్రేజ్ దృష్ట్యా చాలామంది షాపింగ్ మాల్ ఓనర్స్ అనసూయని గెస్ట్ గా తీసుకువచ్చి షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేయించి వాళ్లు కూడా బిజినెస్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఇలా షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ భారీగా సంపాదిస్తోంది అనసూయ.
also read:War 2 Collections: వార్ 2 వీకెండ్ కలెక్షన్స్..కూలీని దాటేసిందా..?