Mitraaw Sharm : సినిమాలంటే ఫ్యాషన్, ఆసక్తితో ఎంతోమంది ఇండస్ట్రీలోకి వస్తూ, సరికొత్త సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇండస్ట్రీలోకి నిత్యం కొత్తవాళ్లు వస్తుంటే పాతవాళ్లు ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. ఇకపోతే ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న వారిలో మిత్ర శర్మ(Mitraa Sharm) ఒకరు. మిత్ర శర్మ అసలు పేరు మిత్ర బింద. ముంబైలో పుట్టి పెరిగిన ఈమె సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సినిమాలపై ఆసక్తితో ఈమె కెరియర్ మొదట్లో బాలీవుడ్ సీరియల్ అయిన భాగ్య విధాతలో నటించారు. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ముంబై నుంచి హైదరాబాద్ మకాం మార్చేశారు.
నిర్మాతగా మిత్ర శర్మ..
ఇలా మిత్రా శర్మ కేవలం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగారు.శ్రీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించడమే కాకుండా బాయ్స్ (Boys)అనే సినిమా ద్వారా నిర్మాతగా మారారు. అలాగే బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలో కూడా పాల్గొని సందడి చేశారు. ఇలానటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీ అవుతున్న మిత్రా శర్మ త్వరలోనే “వర్జిన్ బాయ్స్ ” (Virgin Boys)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. గీతా నంద(Geetha Nanda) మిత్ర శర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన వర్జిన్ బాయ్స్ చిత్రాన్ని రాజా దరపునేని నిర్మించారు.
దం దిగా దం పాట విడుదల..
ఇక ఈ సినిమా జూలై 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ఈ సినిమా నుంచి
“దం దిగా దం” అనే పాటను విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అరియానా, శ్రీహన్, రోనిత్, జెన్నిఫర్ వంటి తదితరులు పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటి మిత్ర శర్మ మాట్లాడిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలకు కారణం అవుతుంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు.
ఇక ఈమె మాట్లాడే విధానం ఆమె మాట తీరు తీవ్రస్థాయిలో విమర్శలకు గురిచేస్తుంది. అచ్చం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు వారసురాలు లక్ష్మీ ప్రసన్న(Manchu Lakshmi Prasanna) మాట్లాడిన విధంగానే ఈమె కూడా కొన్ని పదాలను మింగేస్తూ మాట్లాడటంతో ఈమె మాట తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచు లక్ష్మి చెల్లెలు వచ్చింది రోయ్.. అంటూ ఈమె మాట తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఆమె మాట్లాడే మాటలేంటో? ఆమె చెప్పే డైలాగులు ఏంటో? ఆమెకు తప్ప ఎవరికీ అర్థం కాలేదు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఇక మంచు లక్ష్మి కూడా తెలుగును కూడా అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడుతూ ఎన్నో సందర్భాలలో విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
Also Read: Mahesh Babu: మహేష్ బాబు పై కన్నేసిన బుల్లితెర నటి… నమ్రతకు సవతి పోరు తప్పదా?