BigTV English

MS Dhoni : ధోని స్టోరీ తో మరో సినిమా.. సిద్ధార్థ కొత్త మూవీ ట్రైలర్ అదుర్స్

MS Dhoni : ధోని స్టోరీ తో మరో సినిమా.. సిద్ధార్థ కొత్త మూవీ ట్రైలర్ అదుర్స్

MS Dhoni :  ప్రస్తుతం  సినీ ఇండస్ట్రీలో పలువురు క్రికెటర్ల బయోఫిక్ లు తెరకెక్కించాలని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. టీమిండియా (Team India) మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ బయోపిక్ తీయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. కానీ అది పట్టాలెక్కడం లేదు. అప్పుడు పట్టాలెక్కుతోంది.. ఇప్పుడు ఎక్కుతోంది అని మాత్రం చెబుతున్నారు. మాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ వచ్చేసింది. అలాగే ధోనీ (Dhoni) బయోపిక్ కూడా వచ్చేసింది. అయితే మహేంధ్ర సింగ్ ధోనీతో మరో సినిమా రాబోతున్నట్టు ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది. వాస్తవానికి మాజీ కెప్టెన్ ధోనీ ద అన్ టోల్డ్ స్టోరీ 2016లో విడుదల అయింది. ఇందులో ధోనీ పాత్రను దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోషించాడు. ఇందులో కథ ధోనీ క్రికెటర్ గా మారడం నుంచి భారత కెప్టెన్ గా ఎదగడం వరకు చూపించారు.  ఇక ఈ సినిమా దాదాపు రూ.216 కోట్ల వరకు వసూలు చేసి బాక్సాఫీస్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.


Also Read : Rinku Singh: యోగి ప్రభుత్వంలో రింకూ సింగ్ కు కీలక పదవి.. ఇక క్రికెట్ కు గుడ్ బై! 

ధోనీ స్టోరీతో సిద్దార్థ్ మూవీ.. 


ఇక ఈ సినిమాలో సుశాంత్ (sushanth) నటనకు ప్రశంసలు దక్కాయి. దేశ వ్యాప్తంగా ధోనీ (Dhoni)  అభిమానుల ఆదరణ పొందింది. వాస్తవానికి సచిన్, అజహర్, మిథాలీ రాజ్, కపిల్ దేవ్ వంటి స్టార్ క్రికెటర్ల బయోపిక్ లు తెరకెక్కినప్పటికీ వాటన్నింటలో ఎం.ఎస్. ధోనీ బయోపిక్ మాత్రమే విజయం సాధించడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ధోనీ స్టోరీతో తమిళ హీరో సిద్దార్థ్ ఓ మూవీ వచ్చింది. ఆ సినిమా ట్రైలర్ అదుర్స్ అనిపిస్తోంది. 3BHK పేరుతో తమిళ నటుడు సిద్దార్థ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. శరత్ కుమార్, దేవయాని, యోగిబాబు, మిఠా రఘునాథ్, చైత్ర వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 04న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే.. ఓ మధ్య తరగతి ఫ్యామిలీ సొంత ఒల్లు కొనేందుకు పడే ఇబ్బందులు, వారి కలలను ఆవిష్కరించే భావోద్వేగ భరితమైన సన్నివేశాలను తెరకెక్కించారు.

Also Read : AUS Worst Record: వెస్టిండీస్ చేతిలో ఆస్ట్రేలియా చిత్తు.. 30 ఏళ్ళలో ఇదే తొలిసారి..

3BHK ట్రైలర్ అదుర్స్.. 

ఈ ట్రైలర్ (Trailer) లో సిద్దార్థ్ ఒకానొక సందర్భంలో ధోనీ (Dhoni) పేరు ను కూడా గుర్తు చేసుకున్నాడు. దీంతో ధోనీ స్టోరీతో మరో సినిమా రాబోతుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి అది ధోనీ స్టోరీకి సంబందించింది కానట్టు తెలుస్తోంది. ధోనీ కుటుంబ జీవితాన్ని రిఫరెన్స్ గా తీసుకొని తీసినట్టు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. సినిమా విడుదల అయితే కానీ ఓ క్లారిటీ రానుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ ఆట అసాధారణమైంది కాదు.. అతని అసాధారణ నాయకత్వం నుంచి అతని అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాల వరకు అతను క్రీడలో చెరగని ముద్ర వేశాడు. భారత క్రికెట్ కి ధోనీ అందించిన సేవలు.. అతని రికార్డు-బ్రేకింగ్ ఫీట్ లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తరాల ఔత్సాహిక క్రికెటర్లకు స్పూర్తిని ఇస్తూనే ఉన్నాయి. ముందు ముందు కూడా ఇస్తూనే ఉంటాయి.

Related News

Women’s ODI World Cup : మహిళల ప్రపంచ కప్ లో కూడా ఆస్ట్రేలియా డామినేట్.. ఈ లెక్కలు చూస్తే వణుకు పుట్టాల్సిందే

Kashish Kapoor : ఒక నైట్ కు వస్తావా? అని అడిగాడు… టీమిండియా క్రికెటర్ పై హాట్ బ్యూటీ సంచలన ఆరోపణలు!

Women’s World Cup 2025 : చిన్నస్వామిలో మ్యాచ్ లు బ్యాన్.. తిరువనంతపురంకు షిఫ్ట్.. షాక్ లో RCB!

Kohli Beard : కోహ్లీకి తెల్ల గడ్డం… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న అనుష్క శర్మ !

Salman Khan IPL Team RCB : జట్టును కొనబోతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్?

Dewald Brevis : డెవాల్డ్ బ్రెవిస్ ఊచకోత.. ఏకంగా 8 సిక్స్ లతో రచ్చ..CSK ఇక తిరుగులేదు

Big Stories

×