Rashmika: సినీనటి రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. త్వరలోనే రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె నటుడు దీక్షిత్ శెట్టి(Deekshith Shetty)తో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాల గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి ఇద్దరు ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రష్మిక తనలో దాగి ఉన్న మరో టాలెంట్ కూడా బయటపెట్టారు.. సాధారణంగా మనకి ఏదైనా పని లేకపోతే ఆరోజు మొత్తం సరదాగా అందరితో సమయం గడపడం లేదంటే ఇష్టమైన సినిమాలు చూడటం అది కాకపోతే నిద్రపోవడం వంటిది చేస్తుంటారు. కానీ రష్మిక మాత్రం తనకి ఏమీ పని లేకపోతే అలా సోఫాలో కూర్చొని సైలెంట్ గా ఇంట్లో గోడలు, బయట ఆకాశాన్ని చూస్తూ రోజు మొత్తం గడుపుతానని ఆ టాలెంట్ నాలో ఉంది అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు. రోజంతా ఓకే చోట సైలెంట్ గా కూర్చోవడం అంటే ఎంతో కష్టమైన పని అని చెప్పాలి కానీ రష్మిక మాత్రం అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఇంట్లో గోడలను చూస్తూ రోజంతా ఉండగలనని చెప్పడంతో అభిమానులు షాక్ అవ్వడమే కాకుండా నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక దీక్షిత్ శెట్టి మాత్రం తనకు షూటింగ్ వర్క్ లేకపోతే నిద్రపోతానని తెలిపారు. ఇక రష్మిక మాట్లాడుతూ తనకు టైం పాస్ కాకపోతే ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తానని అయితే అందులో రీల్స్ అలాంటివి తాను చూడను కానీ, మోటివేషనల్ వీడియోస్ చూస్తానని రష్మిక వెల్లడించారు. ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన సినిమా ఏదైనా ఉందా అంటూ దీక్షిత్ శెట్టి ప్రశ్నించడంతో తాను కింగ్డమ్(King dom) సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూశానని రష్మిక వెల్లడించడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంచనాలు పెంచిన ట్రైలర్..
ఇక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు నటుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ధీరజ్ మొగిలినేని దర్శకత్వంలో గీత ఆర్ట్స్ సమర్పణలో ఈ సినిమా నవంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రేమ కథ సినిమాగా ఈ చిత్రం విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ అలాగే పాటలు కూడా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమాలో రష్మికకు జోడిగా దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ఇటీవల థామా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న రష్మిక నవంబర్ 7న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రాబోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: Sandeep Reddy: ఆ సినిమా వల్లే డైరెక్టర్ అయ్యాను.. మైండ్ నుంచి పోలేదంటున్న సందీప్ రెడ్డి!