E-Paper
Advertisement

బిగ్ బాస్ నుండి టెంపర్ వంశీ ఎలిమినేటెడ్!

బిగ్ బాస్ నుండి టెంపర్ వంశీ ఎలిమినేటెడ్!
Advertisement

Bigg boss 10:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న టెంపర్ వంశీ ..బిగ్ బాస్ సీజన్ 10లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దాదాపు 12 వారాలపాటు హౌస్ లో ఉన్న వంశీ ఎట్టకేలకు ఈ వీకెండ్ లో ఎలిమినేట్ అయ్యి, బయటకు వచ్చారు. మరి ఇన్ని రోజులు హౌస్ లో ఉన్నందుకు వంశీకి ఎంత రెమ్యూనరేషన్ లభించింది? అసలు వంశీ ఎలిమినేషన్ కి గల కారణాలేంటి ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

టెంపర్ వంశీ ఎలిమినేటెడ్..

బిగ్ బాస్ సీజన్ 10లో.. 12 వారంలో భాగంగా టెంపర్ వంశీ ఎలిమినేట్ అయ్యారు. పెద్దగా అంచనాలు లేకుండానే హౌస్ లోకి అడుగుపెట్టిన వంశీ గొప్పగా ఆట ఆడకపోయినా ఉన్నంతలో తన ఆటతో పర్వాలేదనిపించుకున్నాడు.. ఒకటికి రెండుసార్లు చివరి వరకు వెళ్లి బయటపడ్డాడు. ఆ తర్వాత పర్వాలేదనిపించుకున్న వంశీ తన ఆటతో ఎట్టకేలకు 12 వారాలపాటు నెట్టుకొచ్చారు. ఇక ఈవారం ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇకపోతే స్టేజ్ పైకి వచ్చిన తర్వాత బాధపడడం, ఎమోషనల్ కావడం లాంటివి కూడా వంశీ లో కనిపించలేదు. ఇంకా స్టేజ్ పైకి రాగానే తన జర్నీ వీడియో చూశాడు. ఎలాగైనా కప్పు కొట్టాలని త్రిగుణ్ తో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

12 వారాలకు గాను సంపాదించింది ఎంతంటే?

Advertisement

సెలబ్రిటీ కేటగిరిలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు వంశీ. వారానికి రూ.2 లక్షలు చొప్పున 12 వారాలకు గాను సుమారుగా రూ.24 లక్షల వరకూ రెమ్యూనరేషన్ ను వంశీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఉదయం కల వచ్చింది.. అంతలోపే నిజమైంది..

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వంశీ స్టేజ్ పైకి వచ్చారు. ఆ తర్వాత వంశీ నాగార్జునతో మాట్లాడుతూ..” నా కూతుర్ని కలిసినట్లు ఉదయమే నాకు కల వచ్చింది.అదే ఇప్పుడు నిజం కాబోతోంది” అని తెలిపారు. ఇక అలాగే తన ఫ్రెండ్ త్రిగుణ్ తో టీవీలో మాట్లాడుతూ కప్పు కొట్టి తీసుకొచ్చి నా చేతిలో పెట్టు అని అన్నాడు అలా శనివారం ఎపిసోడ్ ముగిసిపోయింది.

Advertisement

also read: నలుగురు దర్శకులు రిజెక్ట్.. నెట్టింట ట్రెండింగ్ లో నిలిచిన ‘కొయిల’ సాంగ్..

12వ వారంలో డబుల్ ఎలిమినేషన్..

ఇకపోతే శనివారం ఎపిసోడ్లో 12వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందంటూ నాగార్జున తెలిపిన విషయం తెలిసిందే.ఇక అందులో భాగంగానే డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా మొదట వంశీ ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. వర్షిణి కూడా ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఈ నాలుగు వారాలు ముకేష్ తన ఆటపై ఫోకస్ పెట్టి కప్పు కొట్టాలి అని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.. మరి ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పూర్తయితే మిగిలిన నాలుగు వారాల్లో ముఖేష్ వర్సెస్ త్రిగుణ్ లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

Related News

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య.. బాలు మీనా కలిసిపోయారు.. రవి, శృతి గొడవ.. ప్రభాకు షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి స్ట్రాంగ్ కౌంటర్.. అడ్డంగా దొరికిన కమల్.. రమ్య ఎంట్రీతో ట్విస్ట్..

Podarillu Today Episode : మహా మనసులో చక్రి..విక్కీకి దిమ్మతిరిగే షాక్.. వరాలు రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode November 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు చెప్పిన నిజం అపర్ణను భయపెట్టిందా..?    

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు మాటతో షాక్.. అంజలి వెళ్ళిపోతుందా..? సాగర్ నర్మదా విడిపోతారా..?

Gundeninda Gudigantalu : బాలు ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. రాజేష్ అవుట్..

Illu Illaalu Pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘టీఆర్పీ రేటింగ్.. నవంబర్ నెల హైలెట్స్..

Big Stories

Advertisement
×