Star Heros : ఇండస్ట్రీలో ఈ మధ్య విడాకుల సంఖ్య ఎక్కువ అవుతుంది. స్టార్ హీరోలు సైతం ఎటువంటి కారణాలు లేకుండానే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎంతోమంది హీరోలు విడాకులు తీసుకొని రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో మాట కూడా మాట్లాడుకోకుండా వెంటనే విడాకులు బాట పడుతున్నారు. కొన్నేళ్లుగా ఇలాంటి తంతు ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది.. అయితే విడాకులు తీసుకోవడానికి కారణం వేరే హీరోయిన్స్ తో ఎఫైర్స్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఏ హీరోలు తమ భార్యలకు విడాకులు ఇచ్చి వేరే హీరోయిన్స్ తో ప్రేమైన నడిపించారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇటీవల కాలంలో ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఎలక్షన్స్ టైం లో ఈ మూడు పెళ్లిళ్ల వ్యవహారం ఓ రేంజ్ లో వైరల్ అయింది. అయితే పవన్ కళ్యాణ్ ఆ పెళ్లిళ్ల వెనక ఉన్న అసలు మ్యాటర్ ఏంటో చెప్పి అందరి నోర్లు మూయించారు. ఏది ఏమైనా సరే ఆయన ఇద్దరికీ విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం అన్నా లెజ్నోవా ను పెళ్లి చేసుకొని ఆమెతో ఉంటున్నాడు.
అక్కినేని హీరో నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు.. హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు.. కానీ విడాకులు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
టాలీవుడ్ హీరో సుమంత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. హీరోయిన్ కీర్తి రెడ్డి ని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. అప్పట్లో వీరిద్దరిని చూసి టాలీవుడ్ బ్యూటిఫుల్ పెయిర్ అంటూ చాలామంది కామెంట్లు చేసేవారు. అలాంటిది ఏమైందో తెలియదు కానీ వీళ్ళిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించి విడాకులు తీసుకున్నారు.. ప్రస్తుతం సుమంత్ ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ.. కీర్తి రెడ్డి మాత్రం వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది..
Also Read : నిర్మాతలతో హనుమాన్ డైరెక్టర్ గొడవలు.. ‘జై హనుమాన్’ ఇప్పట్లో రాదా..?
ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోలే ఉన్నారు.. అక్కినేని నాగార్జున కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అలాగే మంచు మనోజ్ కూడా రెండో పెళ్లి చేసుకున్నారు.. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన నరేష్ ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.. కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. అటు తమిళ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలు విడాకుల బాట పడుతున్నారు. ధనుష్, జయం రవి, జీవీ ప్రకాష్ లు విడాకులు తీసుకున్నారు.. నెక్స్ట్ ఏ జంట విడాకులు ప్రకటిస్తుందో అని జనాలు టెన్షన్ పడుతున్నారు.