Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఇటీవల థియేటర్లలోకి వచ్చేసింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ ని అందుకుంది. అయితే కలెక్షన్ల విషయం మాత్రం క్లారిటీగా తెలియలేదు. ఈ సినిమా తర్వాత అందరి చూపు ఓజీ పైన పడింది. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు.. సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఓజీ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ప్రమోషన్స్ మొదలెట్టిన టీమ్..
పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ఓజీ.. ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25 న విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం రీసెంట్ గానే పూర్తి అయ్యాయి. ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. ప్రస్తుతం సెకండ్ హాఫ్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.. ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డబ్బింగ్ కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు రెండు నెలలకంటే తక్కువ సమయం ఉండడంతో అభిమానులు ప్రొమోషన్స్ ఆగష్టు నెల నుండి మొదలు పెడతారేమో అని ఎదురు చూస్తున్నారు.. ఈ మూవీ నుంచి త్వరలోనే సాంగ్ విడుదల కాబోతుంది.
Also Read :స్టార్ డైరెక్టర్ తో మహేష్ మూవీ.. ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..
అనిల్ రావిపూడిని ఫాలో అవుతున్న సుజిత్..
హరిహర వీరమల్లు మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో ఓజీ పై అంచనాలు పెరిగిపోయాయి. ప్రొమోషన్స్ ని మొదలు పెట్టబోతున్నాము అని చెప్పడానికి ఆ చిత్ర డైరెక్టర్ సుజిత్ నుండి విడుదలైన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది.. చూస్తుంటే డైరెక్టర్ సుజిత్ కూడా అనిల్ రావిపూడి బాటలోనే వెళ్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సమయం లో అనిల్ రావిపూడిచేసిన ప్రొమోషన్స్ ఒక సెన్సేషన్. సినిమా మీద జనాల్లో అంచనాలు పెంచడానికి ఆ ప్రొమోషన్స్ బాగా ఉపయోగపడ్డాయి. ఇదేదో బాగుందే అని ప్రతీ డైరెక్టర్ అలాగే చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఓజీ టీమ్ కూడా ఫాలో అవుతుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ రాబోతుందని సమాచారం.. ఈ మూవీ కోసం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా అప్పుడే మొదలు పెట్టారు.. మరి ఇదైన హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి..