Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుకుమార్ (Sukumar)పుష్ప సినిమా(Pushpa Movie)తో పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక పుష్ప సినిమా తర్వాత సుకుమార్ తదుపరి రాంచరణ్ తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతుంది. ఇదిలా ఉండగా తాజాగా సుకుమార్ కుమార్తె సుకృతి వేణి (Sukriti Veni)చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు(National Award) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గాంధీ తాత చెట్టు(Gandhi Thatha Chettu) సినిమాకు గాను చైల్డ్ ఆర్టిస్ట్ గా 71వ జాతీయ చలనచిత్ర అవార్డులకు ఎంపిక అయ్యారు.
ఎంతో గర్వకారణంగా ఉంది..
ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు అందుకోవడం పట్ల ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ సుకృతి వేణికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ విషయంలో సుకుమార్ ఆలస్యంగా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ స్పందిస్తూ … నా ప్రియమైన ముద్దుల కూతురు నేషనల్ అవార్డుకు ఎంపిక అయ్యారనే విషయం తెలిసిన ఆ క్షణం నా నోట మాట రాలేదు. ఇప్పటివరకు నా ప్రయాణంలో ఎన్నో అవార్డులు వచ్చాయి కానీ, ఈ అవార్డు నా హృదయాన్ని తాకిందని తెలిపారు. ఒక మాటలో చెప్పాలి అంటే గాంధీ తాత చెట్టు సినిమా చూస్తున్నప్పుడు అక్కడ నటించింది నా కూతురు అనే విషయాన్ని కూడా మర్చిపోయానని తెలిపారు.
నీ కళ్ళల్లో నిజాయితీ…
కేవలం ఆ పాత్రలో నటిస్తున్న ఒక అమ్మాయిగా మాత్రమే నిన్ను చూశాను. నీ కళ్ళలో ఎంతో నిజాయితీ, భావోద్వేగం చూసానని తెలిపారు. సినిమా సెట్ లో సరదాగా మొదలైన ఈ పని ఇప్పుడు నిన్ను అందరూ గర్వించేలాగా చేస్తుంది. నేడు నీపై అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే ఈ ప్రశంసల ముందు నాకు ఏ అవార్డు కూడా గొప్పది కాదనిపిస్తుందని తెలిపారు. ఇలా నువ్వు మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకోవడం చూస్తుంటే ఎంతో గర్వకారణంగా ఉందని తన కుమార్తె సాధించిన విజయం గురించి, సుకుమార్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చరణ్ సినిమా పనులలో సుకుమార్..
ఇక సుకృతి వేణి నటించిన ఈ గాంధీ తాత చెట్టు విడుదల సమయంలో సుకృతి నటనపై కూడా ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు తాజాగా నేషనల్ అవార్డుకు కూడా ఎంపిక కావడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ చిన్నారికి అభినందనలు తెలియజేస్తున్నారు. సుకుమార్ విషయానికి వస్తే ఈయన దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న సుకుమార్ తదుపరి రాంచరణ్ తో అంతకుమించి ఉండేలా ఓ సినిమా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో రంగస్థలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రస్తుతం ప్రకటించిన సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే సుకుమార్ డైరెక్షన్లో బిజీ కాబోతున్నారు.
Also Read: Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!