August 4 Special: మన జీవితంలో ప్రతీ రోజు ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అయితే ఆగస్టు 4 రోజు మాత్రం రెండు విభిన్న గాథలకు సాక్ష్యం. ఒకటి… దివ్యాంగుల జీవితాల్లో తోడుగా ఉండే సహాయక కుక్కలు గురించి. మరొకటి… సముద్ర సరిహద్దులను రక్షించే అమెరికా కోస్ట్ గార్డ్ దినోత్సవం. ఈరోజు మనం వీటి గొప్పతనాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మొదటిది.. అసిస్టెంట్ డాగ్ డే – సహాయక కుక్కల ప్రత్యేకత..
ప్రపంచంలో ఎంతోమంది శారీరక వైకల్యాలున్న వారు, దృష్టి లేకపోవడం, విని వినలేకపోవడం, నడవలేకపోవడం లాంటి అనేక అడ్డంకులతో జీవితం గడుపుతున్నారు. అలాంటి వారి జీవితాల్లో వెలుగు పంచే ఓ నిస్వార్థమైన తోడు – అసిస్టెంట్ డాగ్. ఇవి సాధారణ కుక్కలు కాదు… ప్రత్యేక శిక్షణ పొందిన సేవా కుక్కలు. వీటి పనితీరులో ప్రత్యేకత ఏమిటంటే – అవి వారి యజమానులకు దారి చూపించటం, జేబు నుండి వస్తువులు తీయటం, డోర్ తెరవటం, అవసరమైన సమయంలో సహాయం కోసమై భయపడకుండా చుట్టుపక్కల వారికి సిగ్నల్ ఇవ్వటం వంటి కీలక పనులను చేస్తుంటాయి.
వీటిని శిక్షణ ఇవ్వడమే ఒక కళ. Guide Dogs, Hearing Dogs, Mobility Assistance Dogs, Seizure Response Dogs వంటివి వివిధ రకాలుగా ఉండే సహాయక కుక్కలు. వీటితో మనుషుల మధ్య ఉన్న సంబంధం నిశ్వార్థమైన ప్రేమతో కూడినది. సహాయం అవసరమైనప్పుడు వీటిలాగే విశ్వాసంగా ఉండే ప్రాణి మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదు.
Assistance Dog Day రోజున, వీటి సేవలను గుర్తిస్తూ, వీటిని శిక్షణ ఇచ్చే కేంద్రాలు, వాటిని పెంచే కుటుంబాలు, అలాగే వీటి సహాయాన్ని పొందుతున్నవారి కథలు ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యం అవుతుంటాయి. ఇది కేవలం ఒక దినోత్సవం కాదు… మన మానవత్వాన్ని పెంచే ఓ సందర్భం.
ఇక రెండోది.. US కోస్ట్ గార్డ్ డే – సముద్రపు వీరుల శౌర్యగాథ..
ఇక మన దృష్టిని మరో కోణం వైపు తిప్పుదాం అదే.. అమెరికా సముద్ర సరిహద్దుల వైపు. 1790 ఆగస్టు 4వ తేదీన అమెరికాలో US కోస్ట్ గార్డ్ స్థాపించబడింది. సముద్ర సరిహద్దుల్ని కాపాడడం, మానవతా సహాయ చర్యలు చేయడం, డ్రగ్స్, అక్రమ రవాణా అడ్డుకోవడం… ఇవన్నీ కోస్ట్ గార్డ్ చేసే పనులలో భాగమే.
కేవలం యుద్ధ పరిస్థితులలోనే కాదు – తుఫాన్లు, వరదలు, ఓడ ప్రమాదాలు జరిగినపుడు కూడా US కోస్ట్ గార్డ్ ముందుండి పనిచేస్తుంది. Search and Rescue, Environmental Protection, Maritime Security – వీటన్నింటిలోను కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది సాధారణ నౌకాదళం కాదు – అమెరికాలో శాంతి సమయంలోనూ పనిచేసే సైనిక బలగం. US నేవీతో కలసి పనిచేసే సమయంలో వీరి ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. “Semper Paratus” అనేది వీరి మోటో – దాని అర్థం “Always Ready”, అంటే ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం అనే అర్థం. ఇది వారి విధేయతకు, సేవా భావానికి ప్రతీక.
ఈ దినాన్ని US లో ప్రధానంగా కోస్ట్ గార్డ్ సిబ్బంది, వారి కుటుంబాలు ఘనంగా జరుపుకుంటారు. పాత యోధుల సేవలను గుర్తించి, ప్రస్తుత సభ్యులకు గౌరవం ఇస్తారు. వీరి కృషితోనే సముద్ర సరిహద్దులు సురక్షితంగా ఉంటాయి.
మనకు సహాయం చేసే ప్రతి జీవికి మనం ఒక ధన్యవాదం చెప్పాల్సిన అవసరం ఉంది – అది మనుషులైనా, ప్రాణులైనా. ఒకవైపు శారీరక పరిమితులు ఉన్నవారికి భద్రత, స్వేచ్ఛ ఇచ్చే సహాయక కుక్కలు… మరోవైపు దేశానికి నిస్వార్థంగా సేవలందిస్తున్న కోస్ట్ గార్డ్ సైనికులు – ఇవే నిజమైన హీరోలు.