Supritha Bandaru: ప్రముఖ సీనియర్ నటీమణిగా పేరు సొంతం చేసుకుంది సురేఖ వాణి (Surekha Vani).. ఒకప్పుడు పలువురు హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేసి మెప్పించింది. లేడీ కమెడియన్ గా, హీరోలకు, హీరోయిన్లకు అక్కగా, అత్తగా, చెల్లిగా కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది సురేఖవాణి. ఇకపోతే కరోనా రావడంతో సినిమా అవకాశాలు లేక ఇంటికే పరిమితమైన ఈమె.. తన కూతురు సుప్రీత (Supritha) తో కలిసి పలు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వాటిని పంచుకుంటూ కూతుర్ని మరింత పాపులారిటీ చేసేసింది. ముఖ్యంగా తల్లీకూతుళ్లు ఇద్దరు అందం విషయంలో పోటీ పడుతూ.. గ్లామర్ వలకబోస్తూ నెటిజన్స్ కి కరోనా సమయంలో మంచి ఎంటర్టైన్మెంట్ అందించారని చెప్పవచ్చు.
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సుప్రీత..
ఇక ఈ ఇంస్టాగ్రామ్ పుణ్యమా అని అటు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే సురేఖవాణి కూతురుకి సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. నిత్యం వెకేషన్స్ కి వెళ్తూ హీట్ పుట్టించే అందాలతో చెమటలు పట్టిస్తూ అందరిని ఆకట్టుకుంది. ఇక చాలా రోజుల తర్వాత బుల్లితెరపై సందడి చేస్తున్న ఈమె.. ఇప్పుడు వెండితెరపై కూడా అలరించడానికి సిద్ధమయింది. అందులో భాగంగానే బిగ్ బాస్ సీజన్ 7 రన్నరప్ గా నిలిచిన అమర్దీప్ చౌదరి (Amardeep Choudhary ) తో కలిసి ‘చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే.
ప్రత్యేక పూజలు చేస్తూ.. భక్తి పారవశ్యంలో మునిగిపోయిన సుప్రీత..
గత కొన్ని రోజుల వరకు అందాల జాతర చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు కట్టు బొట్టు సాంప్రదాయంగా కనిపిస్తూ చీరకట్టులో అలరిస్తోంది. అయితే ఇప్పుడు సడన్ గా ప్రత్యేక పూజలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది సుప్రీత. తాజాగా తన తల్లితో కలిసి ఆ మహా పరమశివుడి లింగానికి భక్తితో అభిషేకం చేసింది. పండితుల సమక్షంలో లింగానికి పూజలు నిర్వహిస్తున్న ఫోటోలను, వీడియోలను సుప్రీత తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో.. ఈ వీడియోలు, ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ పెళ్లి కోసమా? లేక సినిమా సక్సెస్ కోసమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే చాలా రోజుల తర్వాత ఇలా పద్ధతిగా స్వామి సేవలో మునిగిపోయిన ఈ తల్లి కూతుర్లను చూసి నెటిజన్స్ మురిసిపోతున్నారు.
సురేఖ వాణి సినిమాలు..
సురేఖ వాణి సినిమాల విషయానికి వస్తే.. తెలుగు, తమిళ్ సినిమాలలో ఎక్కువగా నటించిన ఈమె.. 2015 నాటికి దాదాపు 45 చిత్రాలకు పైగా నటించింది. 2005లో వచ్చిన ‘శీనుగాడు చిరంజీవి ఫ్యాన్’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. ఆ తర్వాత భద్ర, బొమ్మరిల్లు, నోట్ బుక్, దుబాయ్ శీను, రెడీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఏ మాయ చేసావే, నమో వెంకటేశాయ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నాయక్, పిల్ల నువ్వు లేని జీవితం ఇలా ఎన్నో చిత్రాలలో నటించి ఆకట్టుకుంది.
ALSO READ:Bollywood: పంచాయత్ నటుడికి గుండెపోటు.. ఫ్యాన్స్ ఆందోళన పై నటుడు క్లారిటీ!