BigTV English

Gurugram: గురుగ్రామ్‌లో మొదటి సౌతాంప్టన్ యూనివర్సిటీ .. క్లాసులు ప్రారంభం

Gurugram:  గురుగ్రామ్‌లో మొదటి సౌతాంప్టన్ యూనివర్సిటీ ..  క్లాసులు ప్రారంభం

Gurugram: దేశంలో మొదటి ఫారెన్ సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం గురుగ్రామ్‌లో ప్రారంభించింది. యూజీసీ నిబంధనల ప్రకారం భారతదేశంలో ఏర్పడిన తొలి విదేశీ విశ్వవిద్యాలయ ఇదే. అందులో యూపీ, పీజీ కోర్సులను అందించనుంది. ఈ క్యాంపస్‌లో మరో స్పెషల్ ఉంది, విద్యార్థులు ఓ ఏడాది యూకే, మలేషియాలో క్యాంపస్‌ల్లో చదవొచ్చు.


సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం ఈ ఏడాది సెప్టెంబర్‌లో 140 మంది విద్యార్థులతో విద్యా సెషన్‌ను ప్రారంభిస్తుంది. జాతీయ విద్యా విధానం- 2020 ప్రకారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త నిబంధనల మేరకు దేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన తొలి విదేశీ యూనివర్సిటీ క్యాంపస్.

గురుగ్రామ్‌లోని సెక్టార్ 59లో ఉన్న క్యాంపస్‌ను జూలై 16న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సియానీ దీన్ని ప్రారంభించారు. ఈ క్యాంపస్‌లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ఉంది. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం QS టాప్-100ల్లో ఒకటి. ఈ క్యాంపస్‌లో 75 మందికి పైగా పూర్తి సమయం ఫ్యాకల్టీ సభ్యులను నియమించనుంది. వీరంతా యూకె విద్యా అర్హతలను కలిగి ఉన్నారు. ఫ్యాకల్టీని UK, UAE, జర్మనీ, జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికాలోని ప్రముఖ విద్యా సంస్థల నుండి తీసుకొస్తున్నారు.


బిజినెస్ మేనేజ్‌మెంట్, అకౌంటింగ్ -ఫైనాన్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్‌లో నాలుగు అండర్ గ్రాడ్యుయేట్ (BSc) ప్రోగ్రామ్‌లు, ఫైనాన్స్, ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్‌లో రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ (MSc) ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ఈ డిగ్రీలు పూర్తిగా యూకె విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. ఇక్కడ చదివే విద్యార్థులు.. యూకె లేదా మలేషియా క్యాంపస్‌లలో ఏడాది అవకాశం ఉంది.

ALSO READ: తెలంగాణలో బీటెక్ మేనేజ్ మెంట్ కోటా సీట్లు.. 19నుంచి అడ్మిషన్లు

సౌతాంప్టన్ విశ్వవిద్యాలయానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 290,000 మందికి పైగా గ్రాడ్యుయేట్లతో వివిధ స్థాయిలో పని చేస్తున్నారు. పూర్వ విద్యార్థులకు నెట్‌వర్క్‌ ఉంది. అందులో 1,700 మందికి పైగా భారత్ విద్యార్థులు ఉన్నారు. ఈ పూర్వ విద్యార్థులలో చాలా మంది మెంటర్‌షిప్, పరిశ్రమ సహకారం ద్వారా కొత్త క్యాంపస్‌కు మద్దతు ఇవ్వనున్నారు.

గతేడాది ఆగస్టు 29న లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI)ని అందుకుంది. సెప్టెంబర్ 13న అధికారికంగా ప్రకటన చేసింది. అప్పటి నుండి మొత్తం ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయడం, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 2035 నాటికి ఆ క్యాంపస్‌లో విద్యార్థుల సంఖ్యను 5,000 కి పెంచాలనే ఆలోచనలో ఉంది.

Related News

SGPGIMS Notification: భారీగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. భారీ శాలరీ, దరఖాస్తుకు ఇంకా 4 రోజులే సమయం

OFMK Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం, రేపే లాస్ట్ డేట్ బ్రో

PGCIL Recruitment: పవర్ గ్రిడ్‌లో భారీగా ఉద్యోగాలు.. జీతమైతే లక్షకు పైనే, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

JOB IN APMSRB: ఏపీలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. లక్షల్లో వేతనం, దరఖాస్తుకు కొన్ని రోజులే గడువు

Intelligence Bureau: ఐబీలో 455 ఉద్యోగాలు.. నో హెవీ కాంపిటేషన్, అప్లై చేస్తే కొలువు భయ్యా

LIC Jobs: ఎల్ఐసీలో భారీగా ఉద్యోగాలు.. భారీ శాలరీ, దరఖాస్తుకు ఇంకా 4 రోజులే గడువు

Big Stories

×