Karuppu Controversy: తమిళనాడు సీఎం విజయ్, హీరోయిన్ త్రిషల స్నేహం గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల త్రిష నటించిన కరుప్ప సినిమాకు బెన్ఫిట్ షోకు పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసందే. అయితే ఇప్పడు అది కేన్సిల్ చేశారు సీఎం విజయ్. కోలీవుడ్ స్టార్స్ సూర్య, త్రిషల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) విడుదలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా, చివరి నిమిషంలో ఎదురైన ఆర్థిక వివాదాలుచ, థియేటర్ల ఒప్పందాల సమస్యల వల్ల తీవ్ర ఆటంకాలను ఎదుర్కొంటోంది.
Read also-Honey Rose : హనీ రోజ్ రీఎంట్రీ.. మరో ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో..!
తాజా అప్‌డేట్స్ ప్రకారం, నేడు ఉదయం 9 గంటలకు ప్లాన్ చేసిన ప్రత్యేక ప్రదర్శనలు (మార్నింగ్ షోలు) పూర్తిగా రద్దయ్యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఈ సినిమాకు ప్రత్యేకంగా ఉదయం షోల అనుమతి ఇచ్చినప్పటికీ, అంతర్గత సమస్యల వల్ల షోలు ప్రారంభం కాలేదు. దీనిపై చిత్ర నిర్మాత ఎస్.ఆర్. ప్రభు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. దర్శకుడు ఆర్జే బాలాజీ కూడా భావోద్వేగానికి గురవుతూ, సమస్యను పరిష్కరించేందుకు నిర్మాతలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం హీరో సూర్య స్వయంగా రంగంలోకి దిగి ఈ వివాదాలను సర్దుమణిగేలా చేయడానికి చర్చలు జరుపుతున్నారు.
Read also-ఏషియన్ సునీల్ ప్రొడ్యూసర్ నాగవంశీని అంత మాటన్నాడా.. ఇది ఎక్కడికో పోతుంది..
ఇది ఒక పవర్‌ఫుల్ కోర్ట్‌రూమ్ డ్రామా, హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఒక వృద్ధుడు, అతని మనవరాలికి న్యాయం చేయడం కోసం లాయర్ ప్రీతి (త్రిష) చేసే పోరాటం, ఆ తర్వాత ‘కరుప్పు’గా సూర్య ఎంట్రీతో కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ సినిమా ఇతివృత్తం. ఇందులో సూర్య రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. సెన్సార్ బోర్డు (CBFC) ఈ చిత్రానికి UA సర్టిఫికేట్ ఇచ్చింది. సూర్య వన్-మాన్ షో, త్రిష నటన, మరియు సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు ప్రధాన బలాలు అని సెన్సార్ టాక్ వినిపిస్తోంది. అయితే, ఫస్టాఫ్‌లో కొన్ని కోర్టు సీన్లు కాస్త సాగదీసినట్లు ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ఉన్న అడ్డంకులు త్వరలోనే తొలగిపోయి, మధ్యాహ్నం లేదా సాయంత్రం షోల సమయానికి సినిమా ప్రదర్శనలు ప్రారంభమవుతాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. థియేటర్ల వద్ద అభిమానులు భారీగా వేచి చూస్తున్నారు.