Youtuber:ఈ మధ్యకాలంలో యూట్యూబర్లు వ్యూస్ పెంచుకోవడానికి అసలు ఏం చేస్తున్నామో అనే సభ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఆఖరికి చిక్కుల్లో పడుతున్నారు. సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాల్సింది పోయి.. డబ్బు కోసం కక్కుర్తి పడి తప్పుదోవ పడుతూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు.. ఈ క్రమంలోనే ఒక యూట్యూబర్ ఏకంగా మైనర్లతో అసభ్యకర వీడియోలు చిత్రీకరించడమే కాకుండా వాటిని పబ్లిక్ లో పోస్ట్ చేస్తూ మరింత రెచ్చిపోయాడు.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
అసలు విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ కి చెందిన కంబేటి సత్యమూర్తి అనే ఒక యూట్యూబర్ ‘వైరల్ హబ్ 007’ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ చాలా రోజులుగా ఇంటర్వ్యూలు చేస్తూ వాటిని తన చానల్లో పోస్ట్ చేస్తున్నాడు. ముఖ్యంగా మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించడంతో 2025 అక్టోబర్ 16న ఈ ఛానల్లో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలో ప్రసారమైనట్లు హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించి, దీనిని వారు సుమోటో కింద కేసు నమోదు చేశారు.
ఇకపోతే ఈ కంబేటి సత్యమూర్తి రన్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ లో ముఖ్యంగా 15 నుంచి 17 సంవత్సరాల వయసున్న బాల బాలికలను అసభ్య ప్రశ్నలు అడుగుతూ వారితో అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఇక ఇదంతా ఇతడు వ్యూస్ పెంచుకోవడానికి తన చానల్లో ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ ఏసీపీ శివ మారుతీ టీం, ఎస్ఐ సురేష్ తో కలిసి సత్యమూర్తిని వైజాగ్ లో అరెస్టు చేశారు. అక్కడి నుంచి సత్యమూర్తిని హైదరాబాద్ కి తీసుకురావడం జరిగింది. డిజిటల్ ఎవిడెన్స్ తో నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో, ఐటి చట్టాల కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఇతడు పోస్ట్ చేసిన ఇంటర్వ్యూలలో.. మైనర్లు అసభ్యకరమైన పనులు చేసేలా ప్రేరేపించినట్లు ఉండడంతో నెటిజన్లు కూడా పూర్తిస్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటివి ప్రోత్సహించే వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేయగా.. ఇక ఈ వీడియోలు కాస్త వైరల్ అవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వ్యూస్ పెంచుకొని డబ్బు పొందడం కోసం యూట్యూబర్లు చేస్తున్న ఇలాంటి పనులు అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.
ALSO READ:The RajaSaab Collections: అత్యంత దారుణంగా రాజా సాబ్ డే 1 కలెక్షన్స్… ఈ 5 కారణాల వల్లే!