Actress Tabu:వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూ పోయే హీరోయిన్ టబు(Tabu ) తాజాగా కోర్టు మెట్లు ఎక్కింది అనే వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టబు ఏంటి? అసలు కోర్టు మెట్లు ఎక్కడం ఏంటి? అనే అనుమానాలు ప్రశ్నలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా.. అందులోనూ ఏఐ టెక్నాలజీ వాడకంలోకి వచ్చిన తర్వాత సినీ సెలెబ్రెటీల ఫోటోలను, మాటలను వాళ్లకు తెలియకుండానే మార్చేసి నకిలీ వీడియోలు తయారు చేయడం సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది.
ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ డీప్ ఫేక్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీనివల్ల నటీనటుల పరువుకి నష్టం జరుగుతోంది. అందుకే ఇకపై తమ పేరును, రూపాన్ని, గొంతును కూడా ఎవరూ? ఎక్కడా ? ఆన్లైన్లో లేదా వాణిజ్య ప్రకటనలో లేదా మరెక్కడైనా సరే ఉపయోగించకుండా చట్టపరమైన రక్షణ కావాలి అని ఎంతోమంది కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఐశ్వర్యారాయ్(Aishwarya Rai) , అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan), నాగచైతన్య (Naga Chaitanya), చిరంజీవి (Chiranjeevi), ఎన్టీఆర్ (NTR), అక్షయ్ కుమార్ (Akshay Kumar), కార్తీక్ ఆర్యన్(Karthik Aryan ) ప్రీతి జింటా, కరణ్ జోహార్ ఇలా ఎంతోమంది తమ ఫోటోలు, వాయిస్ ను కేటుగాళ్లు దొంగలించకుండా ముందస్తు ఆర్డర్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే..పైగా గత నాలుగు రోజుల క్రితం కూడా మృణాల్ ఠాకూర్ (Mrunal thakur)కూడా ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు టబు కూడా వీరి బాటలోనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
also read:ఆట సందీప్ కి కూడా తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు.. కార్పొరేట్ స్టైల్లో మెసేజ్!
తన పేరును, ఫోటోలను, వ్యాపార ప్రచారాల కోసం వాడడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నకిలీ ఫోటోలు, డీప్ ఫేక్ సృష్టించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఇంటర్నెట్లో తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి, మోసాలకు పాల్పడడం పై ఆందోళన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ ను జడ్జ్ జస్టిస్ జ్యోతి సింగ్ పరిశీలించినట్లు సమాచారం. ఇకపోతే టబు తరఫున సమర్పించిన పత్రాలలో కొన్ని తప్పులు ఉన్నట్లు జడ్జి కూడా గమనించారట. ఆ పేపర్లలో సరైన వివరాలు లేకపోవడంతో మళ్లీ సరైన సమాచారంతో కొత్త పేపర్స్ ను దాఖలు చేయాలని టబు తరఫు లాయర్ ను కోర్టు ఆదేశించిందని సమాచారం. ఇక కేసులో ఉన్న అన్ని పక్షాల వివరాలు సరిగ్గా ఉంటేనే తగిన విచారణ జరిపి నిర్ణయం తీసుకోవడం కుదురుతుందని కూడా ఢిల్లీ న్యాయవాదులు చెప్పినట్లు సమాచారం. తదుపరి విచారణను ఆగస్టు 6కి కోర్టు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే తన వ్యక్తిత్వ హక్కులను కాపాడుకోవడానికి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది టబు.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన టబు.. ఈ మధ్యకాలంలో ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఏడాది భూత్ బంగ్లా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా యాక్షన్ డ్రామా స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్ అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే నాగార్జున 100వ సినిమాలో కూడా టబు కీలక పాత్ర పోషిస్తుండడం గమనార్హం.