Spider-Man Wedding:ఏంటి.. స్పైడర్ మాన్ మన తెలుగు సంప్రదాయంలో పెళ్లి మండపంలో కూర్చోవడం ఏంటి అనుకుంటున్నారా? అవును.. మార్వెల్ అభిమానులు కూడా ఊహించని ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.
పెళ్లి మండపంలో మన అచ్చ తెలుగు స్పైడర్ మాన్ పక్కన సాంప్రదాయ దుస్తుల్లో భారతీయ పెళ్లికూతురు.. చుట్టూ పూలతో అలంకరించిన మండపం, వేదమంత్రాలు, చుట్టాల సందడి… చూసిన వాళ్లంతా ఇది నిజంగానే పెళ్లా..? లేక ఏదైనా సినిమా షూటింగా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. నెట్‌లో తెగ సర్కులేట్ అవుతున్న ఈ వీడియో పూర్తిగా రూపొందించిన క్రియేటివ్ విజువల్స్ మాత్రమే.
అంటే.. ఊహలకు ఒక రూపం ఇచ్చిన డిజిటల్ క్రియేషన్ మాత్రమే అన్న మాట. ఈ వీడియోలో స్పైడర్ మాన్ అచ్చం మన తెలుగు పెళ్లికొడుకులా కనిపిస్తున్నాడు. పట్టు పంచ, కండువా, సాంప్రదాయ దుస్తులతో రెడీగా ఉన్న స్పైడర్ మాన్ పెళ్లి పీటలపై కూర్చొని ఉండటం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
అంతేకాదండోయ్… తాళి కట్టడం, జీలకర్ర బెల్లం, అక్షింతలు, పెద్దల ఆశీర్వచనాలు.. ఇలా తెలుగు పెళ్లిలో జరిగే అన్ని సంప్రదాయాలను ఈ వీడియోలో అద్భుతంగా చూపించడం విశేషం.
ఇక ఈ ఫోటోలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటో తెలుసా? స్పైడర్ మాన్ పెళ్లికి వచ్చిన అతిథులు.
ఐరన్ మ్యాన్ సంప్రదాయ దుస్తుల్లో అలరిస్తుంటే.. థోర్ సిల్క్ వస్త్రాల్లో సందడి చేశాడు. ఇక కెప్టెన్ అమెరికా కూడా సౌత్ ఇండియన్ వెడ్డింగ్ లుక్‌లో భలే ఒదిగిపోయాడు.
ఈ పెళ్లి వేడుకలో మార్వెల్ పాత్రలను చూపిస్తూ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ వీడియో ఇలా బయటకు వచ్చిందో లేదో.. కొద్ది గంటల్లోనే వేల షేర్లు, లక్షల వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇక ఇదే అసలైన మల్టీవర్స్ అంటూ కొందరు అంటుంటే.. హాలీవుడ్ హీరోకి తెలుగు పెళ్లి అద్భుతంగా సెట్ అయిపోయింది.. ఇది గనుక నిజంగా సినిమా అయితే బాక్సాఫీస్ బద్దలైపోయేది అంటూ కామెంట్ల మీద కామెంట్లు పెట్టేస్తున్నారు నెటిజెన్లు.
నిజంగా చెప్పాలంటే.. ఒకప్పుడు ఇలాంటి వీడియో చేయాలంటే భారీ గ్రాఫిక్స్ టీం అవసరం. కానీ ఇప్పుడు AI టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడంతో కొన్ని కమాండ్లతోనే చాలా ఈజీగా తయారు చేస్తున్నారు నెటిజెన్లు.
సూపర్ హీరోలను మన తెలుగు సాంప్రదాయ పెళ్లిలో చూడటం, గొప్ప గొప్ప వాళ్లను చారిత్రక పాత్రల్లో ఊహించి డిజైన్ చేయడం, ఫ్యూచర్‌లో సిటీస్ ఇలా ఉంటాయి అంటూ గొప్పగా డిజైన్ చేయడం.. ఇలాంటి క్రియేటివ్ కాన్సెప్ట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా మార్వెల్ సినిమాలకున్న ఫ్యాన్ బేస్ చెప్పక్కర్లేదు. ముఖ్యంగా స్పైడర్ మాన్, ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా, డాక్టర్ స్ట్రేంజ్ అంటే ఎన్నో కోట్లాది మందికి ఫేవరెట్.
అలాంటి సూపర్ హీరోలను మన తెలుగు సంప్రదాయ పెళ్లిళ్లలో చూడటం అభిమానులకు నిజంగా ఒక గుడ్ ఎక్స్‌పీరియన్స్.
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకి మార్వెల్ స్టూడియోస్‌తో కానీ, వాటికి సంబంధించిన సినిమాలతో కానీ ఎలాంటి సంబంధం లేదు.
ఇది పూర్తిగా డిజైన్ చేసిన వీడియో మాత్రమే. అయినప్పటికీ ఇండియన్ కల్చర్‌ని, హాలీవుడ్ సూపర్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో మిక్స్ చేసిన ఈ కాన్సెప్ట్ ఇప్పుడు నెటిజెన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
https://x.com/Troll_Cinema/status/2084834010883350558