Actor Madhan Babu Passed Away: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ మధన్ బాబు(71) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపుడుతున్న ఆయన శనివారం సాయంత్రం చెన్నైలోని తన నివాసం మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మధన్ ఆకస్మిక మరణంపై కోలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ వారు నివాళులు అర్పిస్తున్నారు. కాగా ఆయన జెమిని, ఆరు, రన్, జోడీ, మిస్టర్ రోమియో, తెనాలి, రెడ్ వంటి తదితర చిత్రాలతో తమిళ్, తెలుగులో మంచి గుర్తింపు పొందారు.
Also Read: Vijay Devarakonda: మా మూవీ టైటిల్ కింగ్ డమ్ కాదు, దేవర.. తారక్ అన్న వల్లే