Saina Nehwal : భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అభిమానులకు శుభవార్త చెప్పింది. భర్త పారుపల్లి కశ్యప్ తో కలిసి దిగిన ఫోటోను పంచుకుంటూ.. “దూరం దగ్గర చేసింది” అని క్యాప్షన్ ఇచ్చింది. దీని ద్వారా తాము తిరిగి కలిసిపోయామనే సంకేతాలు ఇచ్చింది. కాగా భర్త పారుపల్లి కశ్యప్ తో తాను విడిపోతున్నట్టు సైనా నెహ్వాల్ గత నెలలో ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా చర్చించిన తరువాతనే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు జులై 13న సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
Also Read : ENG Vs IND 5th Test : ఐదో టెస్ట్.. ఇంగ్లాండ్ ఆటగాళ్లతో పాటు సిరాజ్ కూడా తలు వైట్ బ్యాండ్..!
ఊహించని ట్విస్ట్..
” జీవితం మనల్నీ ఒక్కోక్కసారి వేర్వేరు దిశల్లో ప్రయాణించేవిధంగా చేస్తుంది. సుదీర్ఘ చర్చలు, ఆలోచనల అనంతరం నేను, కశ్యప్ విడిపోవాలని నిశ్చయించుకున్నాం. ఈ బంధంలో నాకెన్నో మధురానుబూతులు ఉన్నాయి. ఇకపై కూడా మేము స్నేహితుల్లా కొనసాగుతాం” అని గతంలో సైనా ఓ నోట్ విడుదల చేసింది. అయితే తాజాగా పారుపల్లి కశ్యప్ తో కలిసి దిగిన ఓ ఫొటోను సైనా నెహ్వాల్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ” కొన్ని సార్లు దూరమే.. మన స్నేహితులతో కలిసి ఉండేందుకు మరో ప్రయత్నం చేస్తున్నాం” అని రెండు హార్ట్ ఎమెజీలతో సైనా క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం. సైనా నెహ్వాల్ భర్తతో విడాకులు తీసుకొని.. తాజాగా మళ్లీ కలిసిందా..? అసలు విడాకులు ఎందుకు తీసుకుంది.. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్ దగ్గర శిక్షణ తీసుకున్న సైనా, కశ్యప్ చాలా ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. 2018లో వివాహ బంధంతో ఒక్కటైన వీరు అన్యోన్యంగా ఉండేవారు. కెరీర్ పరంగాను.. ఒకరికొకరు అండగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేసేవాల్లు. అయితే సైనా విడాకుల ప్రకటన చేయగానే.. కశ్యప్ మాత్రం అప్పుడు అస్సలు స్పందించలేదు.
సైనా-కశ్యప్ ప్రేమ అదుర్స్
ఇప్పుడు భార్యతో కలిసి పోస్ట్ షేర్ చేస్తూ తమ రియూనియన్ ని మాత్రం తెలియజేశాడు. కాగా లండన్ ఒలింపిక్స్ 2012లో మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ కాంస్యం గెలవగా.. అదే ఎడిషన్ లో కశ్యప్ పురుషుల సింగిల్స్ లో క్వార్టర్ ఫైనల్ కి చేరుకున్నాడు. . 2015లో మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించారు. భారత్ నుంచి ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. మరోవైపు 38 ఏళ్ల కశ్యప్.. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించారు. 2024లో రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆయన.. కోచింగ్ ప్రారంభించారు. గత కొంత కాలంగా సైనా నెహ్వాల్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. చివరిసారిగా 2023 జూన్‌లో ఆమె ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో ఆడారు. సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా ఓ సినిమా సైతం తెరకెక్కింది. ‘సైనా’ పేరిట 2021లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి అమోల్ గుప్తే దర్శకత్వం వహించగా.. సైనా పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా నటించారు. ఈ చిత్రంలో సైనా, కశ్యప్ మధ్య ప్రేమను చాలా గొప్పగా చూపించారు.