BigTV English

Tammareddy Bharadwaj: ఫిష్ వెంకట్‌కు డబ్బులు అందుకే ఇవ్వట్లేదు.. తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్

Tammareddy Bharadwaj: ఫిష్ వెంకట్‌కు డబ్బులు అందుకే ఇవ్వట్లేదు.. తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్

Tammareddy Bharadwaj: టాలీవుడ్ సినీ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat)గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే. ఇలా హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో ఈయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే తన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని, వెంటనే కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలియచేశారు. కిడ్నీ మార్పిడి కోసం సుమారు 50 లక్షలు వరకు ఖర్చు అవుతుందని దాతలు అలాగే, సినిమా ఇండస్ట్రీ తమను ఆదుకోవాలి అంటూ ఫిష్ వెంకట్ కుమార్తె, ఆయన భార్య కూడా మీడియా ముందు వారి బాధలు మొత్తం చెప్పుకున్నారు.


ఇండస్ట్రీ పై బురద చల్లటం..

ఇలా ఫిష్ వెంకట్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు తప్ప ఎవరూ పెద్దగా స్పందించలేదు. ముఖ్యంగా నటీనటులకు ఇలాంటి ఆపద వస్తే ఆదుకోవడానికి ఇండస్ట్రీ పెద్దలు ముందుకు వస్తారు కానీ ఫిష్ వెంకట్ విషయంలో ఎవరు ముందుకు రాకపోవడంతో బిగ్ టీవీ (Big Tv)ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ (Tammareddy Bhardwaj) ను కలిసి ఇదే విషయం గురించి ప్రశ్నించారు. ఇక తమ్మారెడ్డి భరద్వాజ్ “బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్” ఇంటర్వ్యూలో పాల్గొని అసలు విషయం బయట పెట్టారు. ఇంటర్వ్యూ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న ఆర్టిస్టులు అనారోగ్యానికి గురైన సినీ ఇండస్ట్రీలో (Flim Industry) పెద్దవాళ్లు సపోర్ట్ చేయలేదు అంటూ వెంటనే ఇండస్ట్రీపై బురద చల్లుతారు ఇలాంటి వాటికీ మీరు ఏమని సమాధానం చెబుతారు? అంటూ ప్రశ్న వేశారు.


ఎవరు ఎవరికి ఫ్రీగా సర్వీస్ చేయరు…

ఈ ప్రశ్నకు తమ్మారెడ్డి భరద్వాజ్ సమాధానం చెబుతూ.. “ఎవరు ఎవరికి ఫ్రీగా సర్వీస్ చేయరని తెలిపారు. మనం ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు రేపటి కోసం మనం జాగ్రత్త పడాలి. రేపు మనకు ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు. అందుకోసం కొంత డబ్బును సేవ్ చేసుకోవాలని ఈయన తెలిపారు. రూపాయి సంపాదించి ఆ రూపాయి ఖర్చు చేస్తే రేపు ఏదైనా ఆపద వచ్చినప్పుడు సహాయం చేయమంటే ఎవరు చేస్తారు? ఇప్పుడు మీరు చెబుతున్నారు కదా ఆ వ్యక్తి డబ్బులు తీసుకోకుండా ఏమి సినిమాలు చేసి ఉండరు. అయితే ఆయనకు వచ్చిన జబ్బుకు ట్రీట్మెంట్ చేయించాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇక పెద్ద హీరోలు వారి పనులలో బిజీగా ఉంటూ బయటకు కూడా రాలేరు. చిన్న హీరోలకు అంత పెద్ద మొత్తంలో సహాయం చేసే అంత ఉండదని తమ్మారెడ్డి తెలిపారు.

ప్రజలు ఫ్రీ ఎడ్యుకేషన్ , ఉచిత వైద్యానికి ఇష్టపడటం లేదని తద్వారా భారీగా ధరలు పెరిగిపోయాయని తెలిపారు.. ఈరోజు ఫిష్ వెంకట్ అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో సంపాదించి ప్రభుత్వానికి ఎంతో టాక్స్ కట్టి ఉంటారు. ఇప్పుడు అతనికి ఆరోగ్యం బాగా లేకపోతే సహాయం చేయాల్సింది ప్రభుత్వం (Government) కానీ ఇండస్ట్రీ కాదని తెలిపారు. ఇక ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఒక ట్రస్ట్ ఉంది అయితే అందులో ఎవరికి ఏ అపాయం వచ్చిన 25 వేల రూపాయలకు మించి ఇవ్వటానికి వీలులేదని తమ్మారెడ్డి తెలిపారు. ఇక మాలో హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం లేదని, కేవలం ఉచితంగా హెల్త్ చెకప్ లు మాత్రమే చేసుకునే వెసులుబాటు ఉందని తెలియజేశారు. అందుకే డబ్బు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయొద్దని, డబ్బును ఎవరికి ఊరికే ఇవ్వరు అంటూ ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Also Read: Actress Himaja: ఆ హీరోతో హిమజ లవ్ బ్రేకప్… బయట పెడితే కాపురాలు కూలిపోతాయి!

Related News

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Kishkindhapuri: ఆ టార్చర్ నుండి బయటపడేసిన కౌశిక్.. నో ముఖేష్ నో స్మోకింగ్..!

Madharaasi Collections : తెలుగు రాష్ట్రాల్లో షాకిచ్చిన ‘మదరాసి’.. ఇలా అయితే కష్టమే..!

Sukumar: పుష్ప 3 ర్యాంపేజ్.. సైమా అవార్డ్స్ స్టేజ్‌పై ఊహించని అప్డేట్ ఇచ్చిన సుక్కు

Sandeep Reddy Vanga: దానికి మించిన ఇంటర్వెల్ సీన్ ఇంకేదీ లేదు

Little hearts Collections : లిటిల్ హార్ట్స్‌కు బిగ్ షాక్… పాజిటివ్ టాక్ వచ్చినా తక్కువ కలెక్షన్లే

Big Stories

×