OTT Movie : ఇటీవల కాలంలో హర్రర్ సినిమాల హవా ఎక్కువైంది. ఎందుకంటే ఆడియన్స్ ఎక్కువగా ఈ జానర్ సినిమాలను చూస్తుండడంతో, ఓటీటీలు కూడా మూవీ సజెషన్స్ లో హర్రర్ జానర్ సినిమాలను పుష్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఓటీటీలో దుమ్మురేపుతున్న ఏ మూవీ మాత్రం డీఫెరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది. ఇందులో హర్రర్ అంశాలతో పాటు టైమ్ లూప్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ సినిమా పేరెంటి? కథ ఏంటో తెలుసుకుందాం పదండి.
సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ కన్నడ హర్రర్ టైమ్ లూప్ మూవీ పేరు ‘Rakshasa’. లోహిత్ హెచ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కన్నడ-తెలుగు భాషల్లో విడుదలైంది. ప్రజ్వల్ దేవరాజ్, సోనాల్ మోంటీరో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2025 మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. ఏప్రిల్ నుండి SunNXT OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఒక బ్రహ్మరాక్షస దెయ్యం, టైమ్ లూప్ థీమ్ చుట్టూ తిరిగే ప్రత్యేకమైన హారర్ కథను అందిస్తుంది.
కథలోకి వెళ్తే…
కథ సత్య (ప్రజ్వల్ దేవరాజ్) అనే సస్పెండ్ అయిన పోలీసు ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. అతను తన గతంలోని కొన్ని సంఘటనల వల్ల మానసికంగా కృంగిపోయి ఉంటాడు. సినిమా ఒక పోలీస్ స్టేషన్‌లో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఒక బ్రహ్మరాక్షస అనే పెట్టెలో బంధించిన దెయ్యం సడన్ గా స్టేషన్ ఎవిడెన్స్ రూమ్ లో దర్శనం ఇస్తుంది. ఈ బ్రహ్మరాక్షస దెయ్యం ఒక పురాతన, శక్తివంతమైన దెయ్యం. అలా సినిమా ఒక చిల్లింగ్ నరేషన్ తో ఓపెన్ అవుతుంది.
Read Also :
సత్య సస్పెండ్ అయిన పోలీసు ఆఫీసర్‌గా, పోలీస్ స్టేషన్‌లో ఒంటరిగా ఉంటాడు. అప్పటికే అరెస్ట్ అయిన క్రిమినల్స్ తో పాటు బేస్‌మెంట్ సెల్‌లో ఉంటాడు. ఆకస్మికంగా అతను ఎవిడెన్స్ రూమ్‌లో ఉన్న ఒక పెట్టెను తెరుస్తాడు. బ్రహ్మరాక్షస దెయ్యం విడుదల అవుతుంది. ఇది స్టేషన్‌లో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఈ సంఘటన సత్యను ఒక టైమ్ లూప్‌లో చిక్కుకునేలా చేస్తుంది. ఇక్కడ ఒక గంట వ్యవధిలోనే “డార్క్ అవర్” పదేపదే రిపీట్ అవుతుంది. ఈ టైమ్ లూప్‌లో, సత్య బ్రహ్మరాక్షస దెయ్యంతో పోరాడాలి, అదే సమయంలో అతనిపై ఉన్న ఒక కుట్రను బయటపెట్టాలి. ఈ కుట్ర అతని సస్పెన్షన్‌కు, గతానికి సంబంధించినది. మరోపక్క దెయ్యం శక్తి క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో సత్య గత రహస్యాలు, ఒక ట్రాజెడీ బయటపడతాయి. సత్య ఈ దెయ్యంతో శారీరకంగా, మానసికంగా పోరాడుతాడు. క్లైమాక్స్‌లో సత్య టైమ్ లూప్‌లో చిక్కుకుని, బ్రహ్మరాక్షస దెయ్యంతో ఆఖరిసారి పోరాటానికి సిద్ధపడతాడు. ఈ దశలో ఒక ఆకస్మిక ట్విస్ట్‌లో, విష్ణు కుంభర్ అనే పాత్ర ఊహించని విధంగా కనిపించి, దెయ్యాన్ని ఓడించడంలో సత్యకు సహాయపడతాడు. అసలు హీరో గతం ఏంటి? ఆ దెయ్యం నుంచి హీరో ఎలా తప్పించుకున్నాడు? చివర్లో వచ్చిన ఆ ట్విస్ట్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిన అంశాలు.