Actress Himaja: బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ అనంతరం సినిమా అవకాశాలను అందుకొని వెండితెర సినిమాలలో బిజీగా గడుపుతున్న వారిలో నటి హిమజ (Himaja)ఒకరు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న ఈమెకు బిగ్ బాస్(Bigg Boss) అవకాశం వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా హౌస్ లో పాల్గొన్న ఈమె విజేతగా నిలవాలని గట్టి ప్రయత్నాలు చేసిన చివరికి నిరాశ ఎదురైనప్పటికీ, తన ఆటతీరుతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు. ఇక బిగ్ బాస్ తర్వాత హిమజ కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు. గ్యాప్ లేకుండా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు.
లెటర్స్ ఇవ్వలేదు.. ఫ్లవర్స్ మాత్రమే…
ఇక సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తూనే ఉంటాయి ఈ క్రమంలోనే హిమజ గురించి కూడా గతంలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈమె ఒక స్టార్ హీరోతో ప్రేమలో పడిందని, కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హిమజ ఈ విషయం పట్ల స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. నాకు ఇప్పటివరకు లవ్ లెటర్స్ రాలేదు, కానీ నన్ను ప్రోత్సహిస్తూ చాలామంది ఫ్లవర్స్ ఇచ్చారని తెలిపారు. ఇక మనిషి అన్న తర్వాత ఎక్కడో ఒకచోట లవ్ పుడుతుంది అలా నాకు ఎనిమిదో తరగతిలోనే ప్రేమ పుట్టిందని హిమజ తెలిపారు.
ఎనిమిదో తరగతిలోనే ఫస్ట్ లవ్…
ఎనిమిదో తరగతిలోని ప్రేమ పుట్టిందని చెప్పడంతో ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవచ్చా? అని యాంకర్ ప్రశ్నించారు. ఇప్పుడు వారి పేరు చెప్పి వారిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అంటూ ఈమె క్లారిటీ ఇచ్చారు. అలాగే మీరు ఒక హీరోతో బ్రేకప్(Break Up) చెప్పుకున్నారని కూడా వార్తలు వచ్చాయి కదా? ఎంతవరకు నిజం అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు హిమజ సమాధానం చెబుతూ… నేను కొంతమంది గురించి చెబితే.. కాపురాలు కూలిపోతాయని టైటిల్ పెట్టి మరి ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఆ టైటిల్ కు నాకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. నా స్నేహితురాలు వ్యూస్ కోసం అలాంటి టైటిల్ పెట్టిందని తెలిపారు. ఆ టైటిల్ కు, కంటెంట్ కు కూడా సంబంధం లేదు.
కాపురాలు కూలిపోతాయి..
వాస్తవానికి ఆ వీడియోలో ఉన్న కంటెంట్ ఏంటి అనే విషయానికి వస్తే… ఎవరినైనా లవ్ చేసావా? అని ప్రశ్నించినప్పుడు.. ఇప్పుడు వాడు ఎవరినో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు. ఆ పేరు బయటకు పెడితే కాపురాలు కూలిపోతాయి అందుకే వాళ్ల పేరు చెప్పడం ఇష్టం లేదనే తీరులో కంటెంట్ ఉండగా, పేరు చెబితే కాపురాలు కూలిపోతాయి అనే టైటిల్ తో పోస్ట్ చేయడంతో బీభత్సమైన వ్యూస్ వచ్చాయని, అందరూ అదే నిజమని నమ్ముతున్నారు అంటూ మరోసారి ఈమె క్లారిటీ ఇచ్చారు. ఇలా హిమజ లవ్ బ్రేకప్ గురించి క్లారిటీ ఇవ్వడంతో ఈ రూమర్లకు చెక్ పెట్టినట్టు అయింది.
Also Read: Hari Hara Veera Mall: వీరుమల్లు నుంచి విడుదలైన “ఎవరది.. ఎవరది” పాట