Tammareddy :టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు(Mohan Babu) నిర్మాణంలో మంచు విష్ణు (Manchu Vishnu)డ్రీం ప్రాజెక్టుగా ఇటీవల కన్నప్ప (Kannappa)అనే ఒక మైథాలజీ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే భక్తకన్నప్ప ఆ పరమేశ్వరుడిపై ఎలా తన భక్తిని చాటుకున్నారనే నేపథ్యంలో ఇదివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. అదే తరహాలోనే కన్నప్ప సినిమాని కూడా మంచు విష్ణు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఈ సినిమా జూన్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయి మంచి ఓపెనింగ్స్ రాబట్టాయి.
డబ్బు కోసమే కన్నప్ప చేశారు?
ఇక ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు. ముఖ్యంగా ప్రభాస్(Prabhas) రుద్ర పాత్రలో నటించడం ఈ సినిమాకు హైలెట్ అయిందని చెప్పాలి. ప్రభాస్ కారణంగానే సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయని మంచు విష్ణు కూడా బహిరంగంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇలా కన్నప్ప సినిమాతో విష్ణు చాలా రోజుల తర్వాత మంచి సక్సెస్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ నిర్మాత నటుడు తమ్మారెడ్డి భరద్వాజ్(Tammareddy Bhardwaj) కన్నప్ప సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
శివుడు పార్వతి అసలు సెట్ అవ్వలేదు…
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ సినిమా గురించి మాట్లాడుతూ కన్నప్ప సినిమాలో చాలా విషయాల గురించి అద్భుతంగా చూపించారు అయితే ఈ సినిమాను ఇంతకంటే కూడా గొప్పగా చేయచ్చని తమ్మారెడ్డి వెల్లడించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు సినిమాలు భక్తి ఎక్కడా కనిపించలేదని, కేవలం డబ్బు కోసమే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని చేశారనే భావన కలిగిందని తెలిపారు. ఇక ఈ సినిమాలో శివుడు, పార్వతి పాత్రలలో నటించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్(Akshay Kumar) అలాగే కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)పై కూడా ఈయన విమర్శలు చేశారు. ఆ శివుడు పార్వతి పాత్రలలో నటించిన వారిని చూస్తుంటే నాకు చిరాకు వచ్చిందని తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
ప్రభాస్ రుద్ర పాత్ర హైలెట్..
శివుడు పార్వతిగా వారిద్దరూ అసలు సెట్ కాలేదని ఈయన తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియజేశారు. ఇక వారిద్దరు మినహా మిగిలిన వారందరూ కూడా వారి పాత్రలకు బాగా సెట్ అయ్యారని, ముఖ్యంగా ప్రభాస్ రుద్ర పాత్ర అద్భుతంగా ఉందని తమ్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో శరత్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఇక మంచు విష్ణు సినీ కెరియర్ విషయానికి వస్తే.. ఇటీవల మోసగాళ్లు, జిన్నా వంటి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఇలాంటి డిజాస్టర్ సినిమా తర్వాత కన్నప్ప సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీసుకువచ్చి విష్ణు డేరింగ్ స్టెప్ వేశారనే చెప్పాలి. ఇక ఈ సినిమా మాత్రం ఆయనకు కాస్త ఉపశమనం కలిగించింది.
Also Read: జబర్దస్త్ షో పడిపోడానికి కారణం జనాలే.. నూకరాజు చెప్పింది కరెక్టేనా?