Nukaraju :బుల్లితెరపై ఎన్నో అద్భుతమైన షోలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. కానీ గతంలో ఇలాంటి కార్యక్రమాలు పెద్దగా ప్రసారం అవ్వలేదని చెప్పాలి. అయితే అలాంటి సమయంలోనే మల్లెమాలవారు జబర్దస్త్ కామెడీ షో (Jabardasth Comedy Show)ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా అద్భుతమైన కామెడీ స్కిట్లతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. ఇలా ఈ కార్యక్రమం మొదట్లో కేవలం అబ్బాయిలు మాత్రమే స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన తదుపరి లేడీ కమెడియన్లు కూడా ఈ కార్యక్రమంలో భాగమవుతూ ప్రేక్షకులను మెప్పించారు.
జబర్దస్త్ లో ఏ మార్పు లేదు..
ఇలా ఒకప్పుడు ఈ కార్యక్రమంలో హైపర్ ఆది, సుడిగాలి సుదీర్, అదిరే అభి, చమ్మక్ చంద్ర, వేణు వంటి వారు పాల్గొని సందడి చేశారు అయితే ఇటీవల కాలంలో ఈ కమెడియన్స్ అందరూ కూడా జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో కొత్తవారు ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇక గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో జబర్దస్త్ కార్యక్రమం రేటింగ్ (Jabardasth Rating)పూర్తిగా పడిపోయిందనే చెప్పాలి. ఈ కార్యక్రమానికి సరైన స్థాయిలో ఆదరణ లేదు. ఈ విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జబర్దస్త్ కమెడియన్ నూకరాజు(Nukaraju)కు ప్రశ్న ఎదురయింది..
జనాలు అప్డేట్ అయ్యారు..
జబర్దస్త్ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో ఆదరణ తగ్గింది. ఇలా జబర్దస్త్ పడిపోవడానికి కారణమేంటనే ప్రశ్న ఎదురు కావడంతో నూకరాజు సమాధానం చెబుతూ.. జబర్దస్త్ కార్యక్రమం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది మారింది కేవలం జనాలు(Peoples) మాత్రమే అంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు. ఒకప్పుడు బుల్లితెరపై ఎలాంటి కామెడీ షోలు లేవు. సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలు, డాన్స్ షోలు, న్యూస్ చానల్స్ అంటూ ప్రత్యేకంగా ఉండేవి కానీ ఇప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా కామెడీ చేస్తున్నారు. అందుకే జబర్దస్త్ కార్యక్రమాన్ని చూసే వారి సంఖ్య కూడా తగ్గిపోయిందని తెలిపారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఎంతోమంది కామెడీ వీడియోలు, రీల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
రేటింగ్ కోసం మార్పులు..
ఇలా జనాలు పూర్తిగా అప్డేట్ కావటం వల్లే.. అరగంట పాటు జబర్దస్త్ స్కిట్ చూసి నవ్వడానికి బదులుగా 30 సెకండ్లలోనే రీల్స్ ద్వారా ఆ కామెడీ కనిపిస్తున్న నేపథ్యంలో జబర్దస్త్ షో ని చూడటానికి ఆసక్తి తగ్గించారంటూ నూకరాజు తెలియజేశారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో డబుల్ మీనింగ్ డైలాగులతో ఉండటం వల్ల కూడా ఆదరణ తగ్గిందనే ప్రశ్న కూడా ఎదురయింది. జబర్దస్త్ షోలో స్కిట్ కి అనుగుణంగా ఎక్కడో ఒకచోట ఇలాంటి డబల్ మీనింగ్ డైలాగ్ లు ఉంటాయి తప్ప షో మొత్తం అలాగే ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ డైలాగును ప్రోమోగా వేయడంతో ప్రతి ఒక్కరు జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయని భావిస్తున్నారు, అది పూర్తిగా తప్పు అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం గురించి నూకరాజు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అలాగే ఈ కార్యక్రమ రేటింగ్ పెంచడం కోసం ఎన్నో మార్పులు కూడా చేశారని ఈయన తెలియజేశారు.
Also Read: జబర్దస్త్ లో ఆ ఒక్కడికే విశ్వాసం లేదు.. రోజా కామెంట్స్ అతని గురించేనా?