BigTV English

Tollywood vs Fish Venkat: మన హీరోలు జీరోలా? ఫిష్ వెంకట్‌‌‌ను ఎందుకు ఆదుకోలేకపోతున్నారు?

Tollywood vs Fish Venkat: మన హీరోలు జీరోలా? ఫిష్ వెంకట్‌‌‌ను ఎందుకు ఆదుకోలేకపోతున్నారు?

Tollywood vs Fish Venkat: సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఆ రంగులు ప్రపంచం వెనుక కొన్ని జీవితాలు ఉంటాయని ఎవరూ ఊహించరు. ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చి చాలామంది నటుల నిజ జీవితాలు బయటకు వస్తున్నాయి కానీ ఒకప్పుడు ఇది కూడా తెలియని పరిస్థితి. కృష్ణం వందే జగద్గురు సినిమాలో చెప్పినట్లు “చప్పట్లు అనేవి వినడానికి బాగుంటాయి కానీ తినడానికి పనికిరావు” ఒక నటుడు తనను తాను తెరపై చూసుకున్నప్పుడు మురిసిపోతాడు. ఆ క్షణానికి మాత్రమే సంతృప్తినిస్తుంది. ఆ తర్వాత నిజ జీవితంలో ఎన్ని కన్నీళ్లు ఉంటాయో.


 

టాలీవుడ్ లో చాలామంది నటులు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు సాధించుకున్న నటులలో ఫిష్ వెంకట్ ఒకరు. ఎన్నో సినిమాల్లో నటుడుగా కనిపించిన వెంకట్, తెర పైన కనిపించింది కొద్దిసేపైనా కూడా ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా కామెడీ టైమింగ్ తో అలరించాడు. ఇప్పుడు అలాంటి ఫిష్ వెంకట్ టైం అసలు బాలేదు. రోజురోజుకి ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. కుటుంబ సభ్యులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.


స్టార్ హీరోలకు తెలియదా.?

మామూలుగా చాలా సందర్భాల్లో స్టార్ హీరోలు కొంతమందికి సహాయం అందిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు సహాయం చేసినట్లు కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఫిష్ వెంకట్ పరిస్థితి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. ఎన్నో సినిమాలు చేసి ఉన్నాడు కాబట్టి టక్కని గుర్తుపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కి కూడా తెలుగు సినిమా పెద్దలు, స్టార్ హీరోలు ఆదుకోకపోవడానికి కారణాలేంటి.? కేవలం తెరపైన మాత్రమే హీరోలా.? తెరవెనక జీవితాలు తమకు తెలియనివి కాదా.? తెలిసిన ముందుకు రావడం లేదా.? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రభాస్ ఫేక్ పిఏ 

తెలుగు పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫిష్ వెంకట్ కుటుంబాన్ని ఆదుకుంటారు అని ఒక ఫేక్ పిఏ ఆ ఫ్యామిలీకి ఫోన్ చేశారు. వాళ్లు దాన్ని నిజమైన నమ్మారు. అది ఫేక్ అని తెలిసింది. చాలామంది మీడియా ప్రముఖులు అది ఫేక్ అని తెలిసిన తర్వాత ఈ వార్త గురించి బీభత్సంగా టెలికాస్ట్ చేశారు. కనీసం ఇది కూడా ప్రభాస్ దృష్టికి చేరలేదా. ఎవరు చేర వేయలేదా.? కేవలం ప్రభాస్ అనే కాదు మిగతా హీరోలకు ఎవరికీ తెలియలేదా.?

MAA మెంబర్ షిప్‌ లేదు 

ఫిష్ వెంకట్ ఎప్పటినుంచో నటుడుగా నటిస్తున్నారు. అలానే MAA మెంబర్ షిప్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అప్రూవ్ కూడా అయ్యింది. అయితే అందుకు అవసరమైన డబ్బులు కట్టలేదు. దానివల్ల మా నుంచి కూడా ఆయనకు సాయం లభించే పరిస్థితి కనిపించడం లేదు. మా అధ్యక్షుడు విష్ణు మంచు కూడా దీనిపై స్పందించడం లేదు. భారీ పెట్టుబడులు పెట్టి సినిమాను నిర్మించే మంచు విష్ణు తన వంతుగా తలుచుకుంటే ఒక జీవితాన్ని నిలబెట్టడంలో కూడా కొంత భాగాన్ని పంచుకోవచ్చు. అలానే మా ప్రెసిడెంట్ గా నటులందరినీ ఏకం చేసి ఒక జీవితాన్ని నిలబెట్టే అవకాశం ఉంది. మరి తెలుగు సినిమా పరిశ్రమ ఈ నటుడు గురించి ఎంతలా నిలబడుతుందో చూడాలి.

Also Read : SSMB29 : బిగ్ బ్రేకింగ్, మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ క్యాన్సిల్

Related News

Kishkindhapuri Vs Mirai : సెప్టెంబర్ 12న రాబోయే రెండు సినిమాల డ్యూరేషన్ లు ఇవే

Ilayaraja: ఇళయరాజాకు మద్దతుగా మద్రాస్ హైకోర్టు, అయినా ఈ ఏజ్ లో చాదస్తం ఏంటండీ

Little Hearts: యుఎస్ లో తెలుగోళ్ళు మాస్, ఏకంగా ట్రంప్ తో మీటింగ్ కి సిద్ధమవుతున్న యంగ్ హీరో

Allu Arjun: అఖీరా బాబు కటౌట్ చూసి అల్లు అర్జున్ షాక్, ఇంత పొడుగు ఉన్నావేంటి అల్లుడు

Pawan Kalyan-Allu Arjun: ఒకే ఫ్రేమ్‌లో అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్.. మెగా ఫ్యాన్స్‌కి కనువిందే!

Nandamuri Balakrishna : బాలయ్య కు మొదటి సౌత్ ఇండియన్ హీరోగా ఆ ఘనత

Big Stories

×