Amitabh Bachchan: బాలీవుడ్ ఇండస్ట్రీ గత కొద్దిరోజులుగా భయం గుప్పట్లో ఉంది. గత కొద్దిరోజులుగా బాలీవుడ్ సెలబ్రిటీలకు కాల్పులు బెదిరింపులు, బాంబు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ముంబై మొత్తం హై అలర్ట్ అయింది. ఇకపోతే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్(Amithabh Bachchan) ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు(Bomb Threat ) మెయిల్ రావడంతో ఒక్కసారిగా ముంబై ఉలిక్కి పడింది.ముంబైలోని జుహూలో ఉన్న ఆయన నివాసం ‘జల్సా'(Jalsa)ను పేల్చేస్తాం అంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ విధంగా అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమై జల్సా పరిసర ప్రాంతాల్లో కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
జల్సాతో పాటు పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. ఎక్కడా కూడా అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు గతంలో కూడా ఈయన ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. గత నెల 23వ తేదీ గుర్తు తెలియని వ్యక్తులు అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు మెయిల్ పంపించారు. అప్పటినుంచి ఎంతో అప్రమత్తమైన అమితాబ్ బయటకు వచ్చినా కూడా బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యంతోనే బయటకు వస్తున్నారు.
ఇక తాజాగా మరోసారి కూడా బాంబు బెదిరింపు రావడంతో మరోసారి తీవ్రతల కలకలం రేగింది.తాజాగా వచ్చిన ఈమెయిల్లో అమితాబ్ బచ్చన్ నివాసంతో పాటు బాంబే హైకోర్టు, మహాలక్ష్మి రేస్కోర్స్ పేర్లను కూడా ప్రస్తావించడంతో ఈ ప్రాంతాలలో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ ప్రాంతాలలో ఎక్కడా బాంబులు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఇలా అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఇలా ప్రతిసారి బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నది ఎవరు? ఈమెయిల్ చేయడం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? వారి వ్యూహం ఏంటి అంటూ పోలీసులు అనుమానాలను వ్యక్తం చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు.
ఇలా ప్రతిసారి అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపులు రావడంతో ఆయనకు మరింత భద్రతను పెంపొందించారు. అమితాబ్ నివాసం ఉంటున్న జల్సా ప్రాంతంలో ప్రతి ఆదివారం అభిమానులు పెద్ద ఎత్తున అక్కడ సందడి చేస్తుంటారు అయితే అమితాబ్ కూడా వారికి అభివాదం చేస్తూ ఫాన్స్ ను సంతోష పెడుతుంటారు. ఇక బాంబు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఈయన భారీ భద్రత నడుమ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ సహాయంతో అభిమానుల ముందుకు వస్తూ అభివాదం చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పుడు వరుసగా బాంబు బెదిరింపులు రావడంతో ఈయన యధావిధిగా ప్రతి ఆదివారం అభిమానులను కలవడానికి బయటకు వస్తారా.. లేదంటే కొద్దిరోజులు ఇన్ ఆచారాన్ని పక్కన పెడతారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: అహంకారమా? బాధ?బాబు మోహన్ నీకు ఇది తగునా?